ఆర్పీ పట్నాయిక్ "బ్రోకర్" చిత్రం రిజల్ట్ ఏంటి?

By Srikanya

2010 సంవత్సరం చివరిలో విడుదలైన ఆఖరి చిత్రం "బ్రోకర్" . డైరెక్టర్స్ సినిమా పతాకం పై రమేష్ మద్దినేని నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ కధ, స్క్రీన్-ప్లే తో పాటు సంగీతాన్ని కూడా అందించారు.అలాగే చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తూ,దర్శకత్వం చేసేసాడు. అయితే చిత్రం ఎత్తుకున్న పాయింట్ సమకాలీన సమాజానికి చెందినదే అయినా నేరేషన్ బాగోలేక, అందులోనూ డాక్యుమెంటరీ తరహాలో వినోదం కూడా వదలేసి స్క్రిప్టు వండుకోవటంతో ప్రేక్షకులడుకి తల బొప్పి కట్టించింది.

కథ విషయానికి వస్తే..కమల్ హాసన్ భారతీయుడు చిత్రంలో ట్విస్టు ని గుర్తు చేసే ఈ చిత్రంలో గణపతి (ఆర్.పి.పట్నాయక్) ఓ పెద్ద 'బ్రోకర్' . పొలిటీషియన్స్ ని , గవర్నమెంట్ ఎంప్లాయిస్ నీ తన గుప్పెట్లో ఉంచుకుని పనులు చేయిస్తూ హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటాడు. ఆ క్రమలో తాను ఇప్పించిన ఓ కాంట్రాక్టర్ కట్టిన ఫ్లైఓవర్ కూలి తన కొడుకు చనిపోయినా కూడా అతనికి బుద్ది రాదు.

అయితే అప్పుడు అవినీతి ఆఫీసర్ అయిన ధర్మతేజ (శ్రీహరి మంచివాడిగా మారి గణపతికి ఆదర్శంగా నిలుస్తాడు. దాంతో తాను ఒక్కడు మాత్రమె మారితే సరిపోదు మిగతా వాళ్ళు మారాలి అని టివి9 సహకారంతో ఓ పోగ్రాం చేస్తాడు. ఆ కార్యక్రమం తో గణపతి ఏ విధంగా విజయం సాధించాడు అన్న దిసలో మిగతా కథ నడుస్తుంది. దర్శకుడుగా ఆర్పీ కొన్ని చోట్ల మంచి మెరుపులు చూపించినా ఓవర్ ఆల్ గా సక్సెస్ కాలేకపోయాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X