ఆర్పీ పట్నాయిక్ తన పాటలు కాపీ కొట్టి ఎదిగిపోతున్నాడంటూ కంప్లైంట్ చేస్తోంది విజయనగరంకు చెందిన గడివిడి లక్ష్మి. ఆమె తన శ్రీ విజయ దుర్గా బుర్రకథ ట్రూప్ లో పాడిన అనేక పాటలు ఆర్పీ మొహమాటం లేకుండా కాపీ కొట్టి సినిమాల్లో ఉపయోగించుకున్నాడని ఆరోపిస్తోంది ఆమె. దాదాపు పన్నెండేళ్ళ క్రితం తాను ఆర్పీకి ఓ క్యాసెట్ ఇచ్చి ఎంకరేజ్ చేయమని అడిగానని ఆయన వాటిని వాడుకున్నారంటోంది. ఇక ఆయన ట్యూన్ చేసిన "రాను రానుంటోంది చిన్నదో..రాములోరి గుడికొచ్చె చిన్నది","గాజు వాక పిల్లా.." వంటి అనేక జానపద పాటలు తనవేనని కావాలిస్తే ఆధారాలతో సహా నిరూపిస్తానంటూ ఓ టీవీ ఛానెల్ లో ఇంటర్వూ ఇచ్చింది. అయితే పోతే పోనీ అని, తను చెప్పినా నమ్మరేమో అని తాను ఈ విషయాన్ని ఇష్యూ చేయలేదని..అయితే రెండు రోజుల క్రితం ఆర్పీ ఫోన్ చేసి కొత్త పాటలు ఏమన్నా చేసారా..ఇస్తే మీకు టీవీ సీరియల్లో మంచి వేషం ఇస్తానని ఆశపెట్టడం రగిలించిందని ఆవేదనతో చెప్పింది. ఇక దీనిపై ఆర్పీ ఇప్పటివరకూ ఏ విధమైన కామెంటు చేయలేదు. గతంలో మనసంతా నువ్వే సమయంలో కూడా ఆర్పీ పై ట్యూన్స్ కాపీచేస్తున్నాడంటూ గొడవలు వచ్చాయి.