జెడి మళ్ళి టార్చర్ అవసరమా?
జెడి మరో చిత్రం డైరెక్ట్ చేయటానికి రెడీ అవుతున్నాడు. గతంలో జగపతి బాబుతో కలసి హోమం, సిద్దం సినిమాలు రూపొందిచిన జెడి అవి బాక్స్ ఆఫీసు వద్ద పెద్ద ప్లాప్ లు గా నమోదు కావటం తో ఆగి నటన లో బిజీ అయ్యాడు. తమిళ్ సర్వంలో చేసి అక్కడ ప్లాప్ ఇచ్చినా రోబో చిత్రం లో బుక్కవటం తో బిజీ గా మారాడు. తాజాగా నాగ చైతన్య చిత్రంలో విలన్ గా చేస్తున్నాడు. ఇంతలొ ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకొని రేసెంట్ గా కిక్ తో హిట్ ఇచ్చిన ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారిని కలిసాడు. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో మరో సారి తెలుగు వారకి టార్చర్ పెట్టటానికి రెడీ అయ్యాడు. ఇంతకు ముందు చేసిన రెండు సినిమాలు హిందీ, కొరియా చిత్రాలా ఫ్రీ మేక్ లు కావటం తో ఈ కొత్త కథ పైనా అందరికి అనుమానాలు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తారు అని చెప్తున్నారు. ఎవరా అనే పరిశ్రమలో వారే కాక బయట వారు ఎదురు చూస్తున్నారు. ఏది ఎలా ఉన్న టెక్నికల్ దర్సికుడు అని పించుకోవటం అతనికి కలిసి వచ్చింది అని సీనియర్స్ విస్లేసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











