కిక్ నిర్మాతల టాలెంట్ సెర్చ్
రవితేజ, ఇలియానా కాంబినేషన్లో సురేంద్రరెడ్డి నిర్మించిన కిక్ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం నిర్మాతలు ఆర్.ఆర్.మూవీ మేకర్స్ గతంలోనూ సామాన్యుడు వంటి హిట్ చిత్రాలు తీసారు. తాజాగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో నటించటానికి కొత్త వారికోసం టాలెంట్ సెర్చ్ నిర్వహించనున్నారు. హీరో, హోరోయిన్, సపోర్టింగ్ నటులు కాదల్చిన వారు తమ ఫొటోలను ఈ నిర్మాణ సంస్ధను సంప్రదించే వీలుంది. ఆసక్తి ఉన్నవారు తమ రెస్యూమ్స్ ని [email protected] కి మెయిల్ చేయండి. ఫొటోలు, వయస్సు, నటనలో మీ అనుభవం వంటివి తెలియచేయటం మరువొద్దు. ఏమో మీలోనే ఓ రవితేజ, ఓ ఇలియానా, మరో బ్రహ్మానందం ఉండవచ్చేమో ఎవరు చూడచ్చారు. బెస్టాఫ్ లక్.
rr movie makers talent search program kick resumes ileana surendra reddy రవితేజ ఇలియానా సామాన్యుడు ఆర్ఆర్మూవీ మేకర్స్ బ్రహ్మానందం


Click it and Unblock the Notifications