రాజమౌళి ఆదేశాలతో రంగంలోకి గుండు బాస్... చెర్రీని ఎలా మారుస్తాడో?
Recommended Video

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న మరో భారీ ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. రాజమౌళి పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులో నిమగ్నమయ్యాడు.
సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే లీడ్ యాక్టర్స్ లుక్ ఎలా ఉండాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చిన జక్కన్న... ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను రంగంలోకి దించారు. చెర్రీకి సంబంధించి స్టైలింగ్ బాధ్యతలు ఇతడికి అప్పగించినట్లు తెలుస్తోంది.
15 ఏళ్ల తర్వాత మళ్లీ రాజమౌళితో
పదిహేనేళ్ల క్రితం రాజమౌళి ‘సై' సినిమా కోసం హకీమ్ అలీమ్‌ను తొలిసారి కలిశాడట, ఈ విషాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ముంబై హెయిర్ స్టైలిస్ట్ ట్వీట్ చేశాడు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్' సినిమా కోసం హకీమ్‌తో రామ్ చరణ్ లుక్ రెడీ చేయిస్తున్నారు.

చెర్రీ లుక్ ఎలా ఉండబోతోందో?
ఆలిమ్ హకీమ్... ఇండియాలోని టాప్ హెయిర్ స్టైలిస్ట్స్‌లో ఒకరు. ఇంత పెద్ద స్టైలిస్ట్ అయినా.... అతడు మాత్రం ఎప్పుడూ గుండుతోనే దర్శనిమిస్తుంటాడు. మరి చెర్రీ లుక్‌ను ఈ గుండు బాస్ ఎలా ప్రజంట్ చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

తొలి షెడ్యూల్ వివరాలు నేడు?
‘ఆర్ఆర్ఆర్' చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ వివరాలు నేడు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా ఈ సినిమా ప్రధాన తారాగణం ఎంపిక జరుగాల్సి ఉంది. రాజమౌళి సినిమాలో నటించే అవకాశం ఈ సారి ఇంకా ఎవరెవరికి దక్కిందో? అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రామ రావణ రాజ్యం
‘ఆర్ఆర్ఆర్' చిత్రానికి ‘రామ రావణ రాజ్యం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలిని మించేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











