RRR బాటలోనే ఆచార్య.. ఇప్పట్లో ఆ పనులు మొదలుకానట్లే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం షూటింగ్ స్టార్ట్ చేయాలని చాలా మంది సినీ దర్శకులు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా కూడా వర్కౌట్ కావడం లేదు. గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించిన తరువాత ఎవరు బయటకు కూడా అడుగు పెట్టడం లేదు. అసలైతే సెప్టెంబర్ లోనే చాలా వరకు షూటింగ్స్ స్టార్ట్ అవుతాయాని అంతా భావించారు.
ముఖ్యంగా కొరటాల శివ దర్శకధీరుడు రాజమౌళి కూడా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ లో రోజురోజుకి కరొనా తీవ్రత మరింత ఎక్కువవుతోంది. 50, 60 మంది టెక్నీషియన్స్ అంటే వారు సినిమా చేయలేరు. కనీసం 300 మంది ఉంటేనే వాళ్ల పనులు కొనసాగుతాయట. ఇక కరోనా తగ్గుతుందేమో అని కొరటాల ఒక షెడ్యూల్ కూడా ఫ్రెష్ గా ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో కొనసాగుతుండంతో ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నారు.

కొన్నిరోజుల ముందే RRR షూటింగ్ ని నవంబర్ తరువాత స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు రాజమౌళి తెలిపాడు. అది కూడా కరోనా తీవ్రత తగ్గితేనే అని వివరణ ఇవ్వడంతో సినిమా రిలీజ్ వచ్చే సమ్మర్ లో ఉండదనే క్లారిటీ వచ్చేసింది. ఇక అదే బాటలో ఆచార్య కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక సినిమా షూటింగ్ ని మళ్ళీ నవంబర్ లో లేదా డిసెంబర్ లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఇక మరోవైపు సుకుమార్ పుష్ప సినిమాను కూడా ఇప్పట్లో మళ్ళీ సెట్స్ పైకి తెచ్చేలా లేడు. కానీ శేఖర్ కమ్ముల మాత్రం నాగచైతన్య లవ్ స్టొరీ కేవలం ఏండింగ్ దశలోనే ఉందని అత్యంత సెక్యూరిటీతో షూటింగ్ ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.


Click it and Unblock the Notifications











