బ్రేకింగ్: టాలీవుడ్‌కు మరో షాక్.. ఆచార్య, పుష్ప, RRR రిలీజ్ వాయిదా! లవ్ స్టోరి, టక్ జగదీష్ రిలీజ్ ఎప్పుడంటే!

తెలుగు సినిమా పరిశ్రమపై మరోసారి భారీ దెబ్బ పడే అవకాశం కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో టాలీవుడ్‌కు మళ్లీ కష్టకాలం దాపురించేలా ఉంది. అయితే వచ్చే రెండు మూడు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

కరోనావైరస్ ప్రభావంతో

కరోనావైరస్ ప్రభావంతో


కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో భారీ సముహాలకు ఆస్కారం ఉండే మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తున్నది. కరోనావైరస్ పాజిటివ్ కేసులో రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో సినిమా థియేటర్లలో ఆడియెన్స్ సీటింగ్‌పై ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో భారీ ప్రాజెక్ట్‌‌తో రూపొందిన అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ వేయాలని నిర్ణయం తీసుకొంటున్నారు.

ఏప్రిల్ 15 నుంచి థియేటర్లపై ఆంక్షలు

ఏప్రిల్ 15 నుంచి థియేటర్లపై ఆంక్షలు

కరోనాపరిస్థితులు విజృంభిస్తున్న సమయంలో ఏప్రిల్ 15వ తేదీ నుంచి 30 తేదీ వరకు 50 శాతం సీటింగ్‌ను థియేటర్లలో ప్రదర్శనలు నిర్వహించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రమంలో పలు సినిమాల రిలీజ్‌ డేట్లను మార్చుకొంటున్నారు.

మే 1వ తేదీన టక్ జగదీష్..

మే 1వ తేదీన టక్ జగదీష్..

ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన టక్ జగదీష్, లవ్ స్టోరీ సినిమాలను ఇప్పటికే వాయిదా వేస్తున్నట్టు తెలుస్తున్నది. వాస్తవానికి టక్ జగదీషథ్ ఏప్రిల్ 23వ తేదీన రిలీజ్ చేయాలని అనుకొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకొని మే 1వ తేదీన రిలీజ్ చేయాలని డిసైడ్ చేసినట్టు తెలుస్తున్నది.

రంజాన్‌కు లవ్ స్టోరీ

రంజాన్‌కు లవ్ స్టోరీ

ఇక లవ్ స్టోరి మూవీ కూడా అదే దారిలో వెళ్తున్నది. ఇప్పటికే సినిమా నిర్మాతలు, హీరో నాగచైతన్య ప్రెస్ మీట్ పెట్టి సినిమా వాయిదాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ 19వ తేదీన రిలీజ్ కావాల్సింది. అయితే ఈ సినిమాను రంజాన్ పండగ రోజున రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.

Recommended Video

Vakeel Saab కి అండగా Mega Family ! | Ram Charan | Pawan Kalyan
ఆచార్య, RRR, పుష్ప రిలీజ్ వాయిదా

ఆచార్య, RRR, పుష్ప రిలీజ్ వాయిదా

అలాగే 2021 సంవత్సరానికి ప్రత్యేక ఆకర్షణగా మారిన, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్న ఆచార్య, RRR, పుష్ప సినిమాలను కూడా వాయిదా వేసినట్టు సమాచారం. ఈ సినిమాలను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలన్న విషయంపై నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. ఈ వార్తలకు సంబంధించిన సమాచారాన్ని టాలీవుడ్ నిర్మాతలు అధికారికంగా వెల్లడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X