Jr NTR: టీమిండియా క్రికెటర్లతో జూనియర్ ఎన్టీఆర్.. ఆ ఇద్దరికి స్పెషల్ స్టిల్ ఇచ్చిన తారక్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ రేంజ్ లో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. RRR సినిమా తర్వాత సినిమాలోని స్టార్ క్యాస్ట్ కు అలాగే దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందో కూడా మరోసారి అర్థమయ్యింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా టీమిండియా క్రికెటర్లు కలుసుకోవడం వైరల్ గా మారింది. వారికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. మరో ఇద్దరు క్రికెటర్లకు జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఫోటోలకు స్టిల్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

RRRకు క్రికెటర్లు ఫిదా
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకొచ్చిన ఆ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది సెలబ్రిటీలను ఆకట్టుకుంది. ముఖ్యంగా క్రికెటర్స్ కూడా ఈ సినిమాను చూసి చాలా పాజిటివ్ గా స్పందించారు.

టీమ్ తో తారక్ స్టిల్
ఇక ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమంది టీమ్ ఇండియా క్రికెట్ ఆటగాళ్లు జూనియర్ ఎన్టీఆర్ ను కలుసుకొని ఫోటోలకు స్టిల్ ఇచ్చారు. న్యూజిలాండ్‌తో తొలి వన్డే కోసం హైదరాబాద్‌లో అడుగుపెట్టిన టీమిండియా సభ్యులు యంగ్ టైగర్‌ను కలిశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానం ఉన్న ఈ స్టార్స్ తారక్ ను కలుసుకోవడంతో ఎంతగానో హ్యాపీగా ఉందని అన్నారు.

ఎన్టీఆర్ తో ఇలా..
ఒక ఫ్రేమ్లో జూనియర్ ఎన్టీఆర్ టీమిండియా క్రికెట్ సభ్యులందరికీ కూడా కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చారు అందులో సూర్యకుమార్ యాదవ్ యుజ్వేందర్ చాహల్ శుభమన్ గిల్ దీపక్ చాహార్ అలాగే మరి కొంతమంది క్రికెటర్స్ కూడా ఫోటోలో కనిపించారు. ఒక కార్ షోరూమ్ లో వీరి కలయిక జరిగినట్లుగా ఫోటోలు చూస్తేనే అర్థమవుతుంది.

సూర్య స్పెషల్ విషెస్
ఇక మరొక ఫోటోలో అయితే జూనియర్ ఎన్టీఆర్, సూర్య కుమార్ యాదవ్ ప్రత్యేకంగా ఫోటోకు స్టిల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రత్యేకంగా సూర్యకుమార్ జూనియర్ ఎన్టీఆర్ కు విషెస్ కూడా అందించారు. ఇటీవల పలు ఇంటర్నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు ఎన్టీఆర్ కు సూర్య శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్టీఆర్ భారత స్పిన్నర్
ఇక అదే తరహాలో భారత స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఫోటో దిగాడు. గతంలోనే చాహల్ RRR సినిమా చూసి అందులోని కొన్ని డైలాగ్స్ కు సంబంధించిన రీల్స్ కూడా చేశాడు. అతను టాలీవుడ్ ఇండస్ట్రీలోని మరి కొంతమంది హీరోల సినిమాలు చాలా చూస్తుంటాను అని ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు ఎంతో ఇష్టమైన జూనియర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగడం చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











