Jr NTR: మళ్ళీ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసేది ఎప్పుడంటే.. ఇంటర్నేషనల్ ఈవెంట్ కోసం రెడీ!

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించిన మొట్టమొదటి సినిమా RRR భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకువచ్చిన ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును అందుకుంది. ముఖ్యంగా ఓటీటీలో విడుదలైనప్పుడు చాలామంది హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో కూడా సినిమా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు అవార్డు కూడా దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఆస్కార్ ఈవెంట్ లో ఈ సినిమా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. అందులో నామినేట్ కావడంతోనే సినిమాకు మళ్ళీ ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. అందుకే అమెరికాలో కూడా మరోసారి RRR సినిమాను రీ రిలీజ్ చేయడం జరిగింది.

RRR actor Jr ntr to fly US on March 5th for Academy Awards

ఇక ఈ సినిమాకు సంబంధించిన HCA అవార్డ్స్ ఈవెంట్స్ లో ఇటీవల రామ్ చరణ్ తేజ అలాగే ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. అయితే ఆస్కార్ అవార్డ్స్ కోసం ఇప్పుడు ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ అలాగే మిగతా యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. ఇటీవల నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకోగా తారక్ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు.

అయితే ఇప్పుడు ఆస్కార్ ఈవెంట్ కోసం తప్పకుండా వెళ్లాలి కాబట్టి ఎన్టీఆర్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ ఈవెంట్ మార్చి 13వ తేదీన అమెరికాలో గ్రాండ్ గా జరగబోతోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఐదవ తేదీన అమెరికాకు వెళ్లబోతున్నాడు. ఇక అక్కడ ప్రత్యేకంగా మీడియాకు పలు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కలిసి హాలీవుడ్ మీడియా ముందు హైలెట్ కాబోతున్నారు. ఇక అప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X