Ray Stevenson: RRR విలన్ కన్నుమూత.. షూటింగ్ స్పాట్‌లోనే ఘోరం

సుదీర్ఘ కాలంగా హాలీవుడ్‌లో తనదైన చిత్రాలను చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు రే స్టీవెన్‌సన్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన ఆయన గత రాత్రి కన్నుమూశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోన్న ఈ హాలీవుడ్ నటుడు.. ఆ స్పాట్‌లోనే తుది శ్వాసను విడిచినట్లు తెలిసింది. అయితే, ఆయన మృతికి గల కారణాలు మాత్రం బయటకు రాలేదు. రే స్టీవెన్‌సన్ మృతిపై ఆయన అభిమానులు, సినీ ప్రియులు మొత్తం దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం రే స్టీవెన్‌సన్ 'క్యాసినో' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటలీలో కొద్ది రోజులుగా ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా గడుపుతోన్నారు. అలాంటిది ఆయన అదే షూట్ స్పాట్‌లో అకస్మాత్తుగా కన్నుమూసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని RRR యూనిట్ కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో 'ఆర్ఆర్ఆర్ టీమ్‌లోని మా అందరికీ షాకింగ్ న్యూస్ ఇది. రే స్టీవెన్‌సన్ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. సార్.. స్కాట్ మీరు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు' అంటూ రాసుకొచ్చింది. రే స్టీవెన్‌సన్ RRR మూవీలో బ్రిటీష్ దొర స్కాట్‌గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

RRR Actor Ray Stevenson Passes Away

రే స్టీవెన్‌సన్ 1998లో 'ది థియరీ ఆఫ్ ఫ్లైట్‌' అనే సినిమాతో తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో అత్యుత్తమ పాత్రలను పోషించారు. అందులో కింగ్ ఆర్థర్ (2004), ది అదర్ గైస్ (2010), థోర్ (2011), ది ట్రాన్స్‌పోర్టర్: రీఫ్యూయెల్డ్ (2015), యాక్సిడెంట్ మ్యాన్ (2018) వంటి అనేక చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, RRR చిత్రంతో ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు.

యూకేకు చెందిన రే స్టీవెన్సన్ 25 మే, 1964న జన్మించారు. మరో రెండు రోజుల్లో ఆయన తన 59వ పుట్టినరోజును జరుపుకోబోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు తుది శ్వాసను విడవడం ఆయన అభిమానులను కలిచి వేస్తుంది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X