twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి తల్లి మరణం గురించి తెలిస్తే కంటతడి పెట్టాల్సిందే.. గుండె ముక్కలయ్యేలా విజయేంద్ర ప్రసాద్...

    |

    దేశ సినీ పరిశ్రమ గర్విందచదగిన రచయిత, కథకుడు కేవీ విజయేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారుండరు. తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి బాహుబలి చిత్రంతో ఆయన సృష్టించిన విజయ సునామీ గురించి కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. RRR చిత్రంతో కొత్త చరిత్రను రాయడానికి సిద్దమైన విజయేంద్రప్రసాద్ తన వ్యకిగత, కుటుంబ విషయాలను నటుడు అలీతో పంచుకొంటూ..

    నాది ప్రేమ వివాహం అంటూ

    నాది ప్రేమ వివాహం అంటూ

    విజయేంద్రప్రసాద్ తన వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనది ప్రేమ వివాహమని, వైజాగ్‌లో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. వాళ్లు బర్మా నుంచి వచ్చిన కాందిశీకులు. మేం వైజాగ్ నుంచి హంపీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు స్టేషన్‌లో మా కుటుంబానికి, అన్నయ్యకు పరిచయం చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిపై ఇష్టాన్ని ఫ్యామిలీకి చెబితే తనను హంపి ప్రాంతానికి రప్పించారు. అలానే ఆమె మాతో ఉండిపోయారు అని చెప్పారు.

     నా భార్య కులం ఏమిటంటే..

    నా భార్య కులం ఏమిటంటే..

    భార్యతో తన అనుబంధాన్ని చెప్పుతూ.. ఎవరైనా తన భార్యను ప్రపంచంలో నీ కంటే అందగత్తె ఎవరు లేరు అని పొగిడితే చాలూ.. వారి సంసారం ఎక్కువ కాలం సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మేము కమ్మ కులానికి చెందిన వాళ్లం. పెళ్లి జరిగిన చాలా రోజుల తర్వాత గానీ ఆమె కులం ఏమిటో తెలియలేదు. ఆమె కులం గురించి ఎప్పుడూ అడగలేదు. ఒకరోజు చిరంజీవిని చూసి మావాడు అంటే.. ఏమిటని అడిగితే మాది కాపు కులం అని చెప్పారనే విషయాన్ని అలీతో పంచుకొన్నారు.

     స్ట్రోక్‌తో కోమాలోకి వెళ్లారు అంటూ

    స్ట్రోక్‌తో కోమాలోకి వెళ్లారు అంటూ

    తన భార్య అనారోగ్యం గురించి చెబుతూ.. మా జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో ఆమెకు స్ట్రోక్ వచ్చింది. దాంతో నా భార్య కోమాలోకి వెళ్లిపోయింది. సుమారు ఆరు నెలలు కోమాలోనే ఉండిపోయారు. ఆమె కోసం ఓ గదిని హాస్పిటల్‌గా మార్చాం. అయితే ఆమె ఆరోగ్యం మెరుగుపడలేదు అంటూ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

    ఆ నరకం వద్దని దేవుడిని వేడుకొన్నా

    ఆ నరకం వద్దని దేవుడిని వేడుకొన్నా

    తన భార్య కోమాలో ఉన్నప్పటికీ మా మాటలకు స్పందించేది. ఆమె కోమా నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్లర్లు చెప్పారు. కానీ కోమా నుంచి బయటకు వచ్చినా ఆమె శరీరం చచ్చుబడి ఉంటుంది. జీవితాంతం ఆమె అలానే ఉండిపోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ సమయంలో దేవుడిని ఒక్కటే కోరుకొన్నాను. ఇస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి లేదంటే.. మీరే ఈ లోకం నుంచి ఆమెను తీసుకెళ్లండి అని కోరుకొన్నాను. ఆ నరకం వద్దని దేవుడికి దండం పెట్టుకొన్నాను అని విజయేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

    Recommended Video

    Rajamouli గురించి తెలిసే Mahesh Babu ఇలా | Mahesh Babu Rajamouli Movie || Filmibeat Telugu
    బాహుబలి సక్సెస్ చూసి ఉంటే బాగుండని

    బాహుబలి సక్సెస్ చూసి ఉంటే బాగుండని

    నా కెరీర్‌లో ఉన్నతిని నా భార్య దగ్గరగా చూశారు నా కుమారుడు సక్సెస్‌ను కూడా దాదాపు చూశారు. బాహుబలి సక్సెస్‌ను చూసి ఉంటే బాగుండేదని చాలా సార్లు అనుకొన్నాను. చాలాసార్లు ఆమెను తలచుకొని కన్నీళ్లు పెట్టుకొన్నాను. ఆమె చూస్తే బాగుండేని పదే పదే అనిపిస్తుంటుంది. ఆమె ఎక్కడ ఉన్నా మా సక్సెస్‌ను చూస్తూనే ఉంటారు అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.

    English summary
    RRR Director SS Rajamouli mothers death: Baahubali Writer Vijayendra Prasad reveals shocking incidents behind his wife health. He shared information of wife illness with actor Ali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X