Jr ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు బలవంతంగా తాగించారు.. పార్టీలో బాలయ్య కూడా: రాజమౌళి కామెంట్ వైరల్
దర్శక ధీరుడు రాజమౌళి తన ప్రతీ హీరోతో కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఏ నటుడు అయినా సరే ఏ టెక్నీషియన్ అయినా సరే రాజమౌళితో ఒక్కసారి వర్క్ చేస్తే చాలా క్లోజ్ గా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ తరహాలో మారిపోతూ ఉంటారు. ఇక ఆయనకు అత్యంత క్లోజ్ గా ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ అలాగే రామ్ చరణ్. అయితే ఒక సమయంలో రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా బలవంతంగా తాగించేసారు అని రాజమౌళి ఒక వివరణ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సాక్ష్యం కూడా వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ బంధం
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఎస్.ఎస్ రాజమౌళికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ ఇద్దరితో రాజమౌళి చేసిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ సినిమాలు చేయగా చరణ్ తో మొదట మగధీర సినిమా చేయడం జరిగింది. ఇక ఈ ఇద్దరితో కలిపి RRR సినిమా చేయగా అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునందుకుంది.

బాహుబలి కంటే ఎక్కువగా..
ఇక రాజమౌళితో ఒక్కసారి సినిమా చేస్తే మళ్ళీ విడిచిపెట్ట బుద్ధి కాదు అని చాలామంది నటీనటుల వివరణ ఇచ్చారు. ఇక రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరితో కలిసి తీసిన RRR సినిమా మంచి గుర్తింపును తీసుకువచ్చింది. బాహుబలి కంటే ఎక్కువ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.

ఆస్కార్ వేడుకలో
అయితే RRR సినిమాకు సంబంధించిన ఆస్కార్ హడావిడిలో ఇప్పుడు చిత్ర యూనిట్ అందరూ కూడా చాలా బిజీగా ఉన్నారు. నాటు నాటు పాటకు గాను RRR సినిమా ఆస్కార్ వేదికపై స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతోంది. తప్పకుండా ఈ పాటకు ఆస్కార్ అవార్డు దక్కుతుంది అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

రాజమౌళిని ఇబ్బంది పెట్టేలా..
అయితే రాజమౌళి చేసిన ఒక ఓల్డ్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా రాజమౌళిని ఖాళీ సమయాల్లో సరదాగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే పార్టీలో కూడా రాజమౌళికి అలవాటు లేనిది తాగిపించినట్లు తెలిసిపోయింది.

బలవంతంగా తాగించారు
2010లో రాజమౌళి ఈ విధంగా ట్విట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే పార్టీలో బాలయ్య బాబు డాన్స్ తో అదరగొట్టేసాడు అని అలాగే జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఇద్దరు కూడా తనకు బలవంతంగా వోడ్కా తాగించారు అని ట్వీట్ చేశాడు. అలాగే ఇద్దరూ కూడా చాలా బ్యాడ్ బాయ్స్ అని కూడా వివరణ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











