RRR మూవీకి ఊహించని షాక్.. ఈ సారి ఆలియా భట్ రూపంలో
Recommended Video
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్‌కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాల రూపంలో వాయిదా పడుతూ వచ్చిన RRR సినిమాకి ఈ సారి ఆలియా భట్ రూపంలో షాక్ తగిలింది. దీంతో సినిమా విడుదల తేదీ పై అనుమానాలు మొదలయ్యాయి. వివరాల్లోకి పోతే..

వరస బ్రేకులు.. నిరాశలో ఫ్యాన్స్
ఇప్పటికే ఈ సినిమాలో నటిస్తున్న ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాలపాలు కావడం.. ఆ కారణంగా షూటింగ్‌కి వరస బ్రేకులు పడటంతో మెగా, నందమూరి ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఆ ఇద్దరు గాయాల నుంచి తేరుకున్నారో లేదో ఇప్పడు హీరోయిన్ ఆలియా భట్ సిక్ కావడం తెలుగు ప్రేక్షకులకు షాకిస్తోంది. అంతా సవ్యంగా సాగుతుంది అనుకునే సమయం లోనే ఊహించని వార్త కలవరపెడుతోంది.

అలియా భట్‌కు పేగు ఇన్ఫెక్షన్
ప్రస్తుతం ఆలియా భట్ బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆమెకు పేగులో చిన్న ఇన్ఫెక్షన్ సోకిందట. అయినా పెద్దగా పట్టించుకోని ఆలియా.. అలాగే బ్రహ్మాస్త్ర షూటింగ్ లో పాల్గొంటోంది. అయితే షూటింగ్ స్పాట్‌లో ఉన్న వేడికి ఆ సమస్య ఎక్కువ కావడంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం న్యూ యార్క్ వెళ్ళిపోయింది ఆలియా.

బ్రహ్మాస్త్ర షూటింగ్ రద్దు.. ఆర్ఆర్ఆర్ కొత్త చిక్కు
దీంతో బ్రహ్మాస్త్ర షూటింగ్ రద్దు చేశారు ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ట్రీట్మెంట్ పూర్తి చేసుకొని ఆలియా న్యూ యార్క్ నుంచి తిరిగొచ్చాకే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇదే ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీమ్‌కి పెద్ద షాకింగ్ న్యూస్ అయింది. న్యూ యార్క్ నుంచి రాగానే ముందుగా బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తిచేశాకే ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వస్తానని కన్ఫర్మ్ చేసిందట ఆలియా.

అహ్మదాబాద్ షెడ్యూల్ ప్లాప్ అయినట్లేనా..?
ప్రస్తుతం హైదరాబాద్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుపుతున్న రాజమౌళి.. మరికొద్ది రోజుల్లోనే అహ్మదాబాద్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లోనే ఆలియా జాయిన్ కావాల్సి ఉంది. దీంతో సరిగ్గా ఈ తరుణంలో ఆలియా ఇచ్చిన షాక్.. ఆర్ఆర్ఆర్ టీమ్ నెత్తిన గుదిబండలా మారింది.

ఎన్టీఆర్ హీరోయిన్ అలా.. చెర్రీ హీరోయిన్ ఇలా
ఇప్పటికే ఎన్టీఆర్ సరసన నటించనున్న హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకొని ఆశ్చర్య పర్చగా.. ఇప్పుడు చెర్రీ హీరోయిన్ ఆలియా భట్ సిక్ అయి ఇలా షాకిచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నడుమ రాజమౌళి చెప్పినట్లు 2020 జులై 30కి ఆర్ఆర్ఆర్ విడుదల కష్టమే అనే టాక్ ముదురుతోంది.


Click it and Unblock the Notifications











