twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హార్వర్డ్ యూనివర్శిటీ సదస్సులో ‘ఆర్ఆర్ఆర్’ గురించి రాజమౌళి.. ఏమన్నారంటే?

    |

    'బాహుబలి' ప్రాజెక్టుతో ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో సునామీ సృష్టించిన దర్శకుడు రాజమౌళి... 'ఆర్ఆర్ఆర్' పేరుతో మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్లో ప్లాన్ చేశారు.

    2018లో లాంచ్ అయిన ఈ చిత్రం ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అయితే సినిమా ప్రారంభమైనప్పటి నుంచి రాజమౌళి ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీలో జరుగుతున్న సదస్సులో ప్రసంగించే అవకాశం దక్కించుకున్న ఆయన తొలిసారిగా ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు.

    ‘ఇండియా ఎట్ ఇంఫ్లెక్షన్ పాయింట్’

    ‘ఇండియా ఎట్ ఇంఫ్లెక్షన్ పాయింట్’

    హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ‘ఇండియా ఎట్ ఇంఫ్లెక్షన్ పాయింట్' అనే అంశంపై జరిగిన సదస్సులో రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాను ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.

    ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా

    ‘ఆర్ఆర్ఆర్’ ప్యాన్ ఇండియా

    ‘ఆర్ఆర్ఆర్' ప్యాన్ ఇండియా చిత్రంగా రాజమౌళి అభివర్ణించారు. బడ్జెట్‌ పరంగా చూస్తే బాహుబలికి సమానమైన చిత్రంగా దీన్ని చెప్పవచ్చని తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్' మొదలైన తర్వాత రాజమౌళి దీని గురించి మాట్లాడటం ఇదే తొలిసారి.

    ఏ విషయం బయటకు రావడం లేదు

    ఏ విషయం బయటకు రావడం లేదు

    ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు విషయంలో ఏ చిన్న విషయం కూడా లీక్ కాకుండా రాజమౌళి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సినిమా సెట్లోకి సెల్ ఫోన్లు అనుమతించడం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఏమిటి? స్టోరీ బ్యాగ్రౌండ్ ఏమిటి? ఇలా ప్రతి విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది.

    ఆర్ఆర్ఆర్

    ఆర్ఆర్ఆర్

    'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రామ్ చరణ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ మూవీని రూ. 300 కోట్ల ఖర్చుతో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లు, ఇతర తారాగణం ఎవరు? అనేది త్వరలో వెల్లడించనున్నారు.

    English summary
    First time Rajamouli opened up about RRR, and that too at the prestigious Harvard University Conference based on the theme ‘India at an Inflection Point’. During the conference, Rajamouli revealed that RRR is a pan-Indian film and that the film is being made on a large scale on par with Baahubali.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X