twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR:విడుదలకు ముందే మరో రికార్డు.. ఆ టెక్నాలజీతో తొలి చిత్రంగా విడుదల

    |

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా ఖ్యాతి కేవలం భారత దేశం మాత్రమే కాకుండా విశ్వవ్యాప్తం అయిపోయింది. దీంతో అప్పటి నుంచి టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాలకు మార్గం సుగమం అయింది. ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ సినిమా పేరే RRR - రౌద్రం రణం రుధిరం. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తూ ఉండడమే కాక అనేక మంది ఇతర భాషలకు నటీనటులు కూడా నటించిన క్రమంలో ఈ సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే అనేక విషయాల్లో రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఇండియాలోనే మొట్టమొదటి డాల్బీ సినిమాగా నిలవనుంది. ఆ వివరాలు మీకోసం

    భారీ బడ్జెట్ తో

    భారీ బడ్జెట్ తో

    తెలుగు రాష్ట్రాలకు చెందిన తొలి తరం స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత కథలకు కల్పిత కధ జోడించి రాజమౌళి తెరకెక్కించిన మూవీ RRR -రౌద్రం రణం రుధిరం. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.

    వాయిదా పడి

    వాయిదా పడి

    ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రేయ శరన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ వంటి వారు నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR మూవీని 2020 లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా అనేక సార్లు పెరుగుతూ తగ్గుతూ రావడంతో అది వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మరికొన్ని డేట్లను ప్రకటించారు.

    చివరిగా ప్రకటించి

    చివరిగా ప్రకటించి

    అయితే అప్పుడు కూడా సినిమాను విడుదల చేయడం కుదరలేదు. చివరికి సంక్రాంతికి తీసుకు రావాలని అనుకున్నారు. కానీ థర్డ్ వేవ్ కారణంగా అప్పుడు కూడా విడుదల చేయడం సాధ్య పడలేదు. ఇక ఈ సినిమాను మార్చి 25న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ చివరిగా ప్రకటించి ఆ మేరకు సన్నాహాలు చేసుకుంటోంది.

    డాల్బీ సినిమాలో

    డాల్బీ సినిమాలో

    అయితే ఈ సినిమా చూసే ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం సినిమా కోసం 'డాల్బీ సినిమా' అనే టెక్నాలజీ వాడబోతున్నారు. ఆ విధంగా డాల్బీ సినిమాలో విడుదలవుతున్న మొట్ట మొదటి ఇండియన్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలవబోతోంది. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మన దేశంలో కాదు కానీ విదేశాల్లో ఐమాక్స్ లాంటి పెద్ద తెరలు ఉన్న థియేటర్స్ లో ది బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేందుకు ఈ డాల్బీ సినిమా టెక్నాలజీని వాడతారు.

    Recommended Video

    Alia Bhatt About Jr.NTR During RRR | Gangubai Kathiawadi | Part 2 | Filmibeat Telugu
    చిక్ బళ్లాపూర్ లో

    చిక్ బళ్లాపూర్ లో

    ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే అతి పెద్ద తెర ఉన్న యూకేలో ఈ సినిమా ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నారు. ఈ తెరపై డాల్బీ సినిమా టెక్నాలజీతో సినిమా టెలికాస్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Read more about: rrr
    English summary
    RRR is the First Indian film going to release in Dolby Cinema format.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X