అదిరిపోయే రికార్డ్.. టాలీవుడ్‌లో RRR నెంబర్ వన్.. యూట్యూబ్‌లో ట్రెండ్
టాలీవుడ్‌లో మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం ఆర్ఆర్ఆర్ మాత్రమే. ఈ మూవీ తరువాతే ఏదైనా వస్తుంది. ఎందుకంటే దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తరువాత తెరకెక్కిస్తున్న సినిమా అవ్వడం, పైగా అందులో టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి నటించడం వంటి వాటితో టాలీవుడ్‌లో అందరి కళ్లు దీనిపైనే పడ్డాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నేషనల్ ప్రాజెక్ట్ అయింది. ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా ఆ సినిమాకు ఉండాల్సిన భారీదనం కోసం రాజమౌళి బాగానే కష్టపడుతున్నాడు.

తాజాగా అలా..
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం స్పెషల్‌గా ఓ ప్లాన్ వేశాడు జక్కన్న. వాయిస్ ఓవర్ ద్వారా సినిమాకు మరింత బూస్టప్ ఇప్పించాలని చూస్తున్నాడట. అందుకోసం హిందీలో ఆమిర్ ఖాన్‌తో వాయిస్ ఓవర్ సెట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక రాజమౌళి అడిగితే ఆమిర్ ఖాన్ కచ్చితంగా కాదనడు.

కొమురం భీం టీజర్..
ఓ వైపు ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ వార్తలు ట్రెండ్ అవుతూ ఉంటే మరో వైపు కొమురం భీం టీజర్ రికార్డులు మార్మోగిపోతున్నాయి. ఎన్టీఆర్‌ను కొమురం భీంగా పరిచయం చేస్తూ వచ్చిన ఈ టీజర్ నేటికీ రికార్డుల వేటను కొనసాగిస్తూనే ఉంది. టీజర్ వచ్చి నెల అవుతున్నా రికార్డులు మాత్రం ఆగడం లేదు.

రెండు లక్షలకు పైగా..
ఇక, దసరా సందర్భంగా విడుదలైన `రామరాజు ఫర్ భీమ్` కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ వీడియో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అక్టోబర్ 22న విడుదలైన ఈ టీజర్ ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కామెంట్లను దక్కించుకుంది.

టాలీవుడ్‌లో టాప్..
టాలీవుడ్‌లోని ఏ టీజర్‌కు కూడా ఈ స్థాయిలో కామెంట్లు రాలేదు. అలా రెండు లక్షలకు పైగా కామెంట్లు దక్కించుకున్న టీజర్‌గా టాలీవుడ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక ఈ టీజర్ ఇప్పటి వరకు 3 కోట్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 11 లక్షల లైకులను తన ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











