For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR టీం కీలక ప్రకటన.. ఈ రేట్లతో విడుదల చేయడం కష్టమే.. కానీ మీరు అనుకున్నట్టు చేయడం లేదంటూ క్లారిటీ!

  |

  ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం ఇప్పటికీ ఇంకా తేలలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ విడుదల సమయంలో భారీగా తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. అయితే ఇప్పుడు వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు ఉన్న కారణంగా టికెట్ రేట్లు పెంచమని ముందు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. తాజాగా ఈ విషయం మీద భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ సినిమా యూనిట్ స్పందించింది.

  డిస్ట్రిబ్యూటర్లకు వర్క్ ఔట్ కాదు

  డిస్ట్రిబ్యూటర్లకు వర్క్ ఔట్ కాదు

  రాజమౌళి దర్శకత్వంలో నందమూరి వంశానికి చెందిన నందమూరి తారక రామారావు జూనియర్, అలాగే మెగాస్టార్ కుటుంబం నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పలు కీలక నటీనటులతో ఎక్కడా తగ్గని విధంగా ఈ సినిమాను రూపొందించారు.

  ఎక్కడా తగ్గకుండా

  ఎక్కడా తగ్గకుండా

  'రౌద్రం రణం రుధిరం పేరుతో తెలుగులో విడుదల అవుతున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాకు సుమారు రూ. 400 నుంచి 500 కోట్ల వరకూ ఖర్చు అయినట్టు ఇండస్ట్రీ వర్గాల అంచనా. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న టికెట్ రేట్స్ ప్రకారం అమ్మితే... నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు గిట్టుబాటు కాదు. గతంలో ఇటువంటి భారీ సినిమాలు తీసినప్పుడు విడుదలకు ముందు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు తెచ్చుకునేవారు.

  బాహుబలి విషయంలో ఏం జరిగింది

  బాహుబలి విషయంలో ఏం జరిగింది

  'బాహుబలి' విడుదల అయినప్పుడు కూడా దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు అమ్మారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల లో మ‌ల్టీప్లెక్స్‌ల‌లో అధికారికంగానే మూడు వందల రూపాయలు అమ్మారు. బెనిఫిట్ షోస్ సంగతి అయితే చెప్పనవసరం లేదు, టికెట్ రేటు పది ఇంతలు పెరిగిపోయి, వేల రూపాయల రేట్లు పలికాయి. ఇప్పుడు ఉన్న రేట్స్ ప్రకారం అయితే డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించలేమని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడంతో కొత్త టెన్షన్ నెలకొంది.

  అబ్బే అదేం లేదు

  అబ్బే అదేం లేదు

  ఏపీలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వవల్సిందిగా కోర్టును ఆశ్రయించాలని 'ఆర్ఆర్ఆర్' దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాత డి.వి.వి దానయ్య డిసైడ్ అయినట్టు వదంతులు వినిపించాయి. అయితే ఈ విషయంలోనే ఇప్పుడు రంగంలోకి దిగిన డి.వి.వి. ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ ఖండించింది.

  Recommended Video

  KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
  జగన్ ని మళ్ళీ కలుస్తాం

  జగన్ ని మళ్ళీ కలుస్తాం

  "టికెట్ రేట్లు తగ్గించడం వలన సినిమా పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతున్నదనే మాట నిజం. అయితే... 'ఆర్ఆర్ఆర్' సినిమా బృందానికి కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం, మా పరిస్థితులు వివరించి సామరస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తాం" అని 'ఆర్ఆర్ఆర్' ప్రొడక్షన్ హౌస్ డి.వి.వి. ఎంటర్ టైన్‌మెంట్ తాజాగా ట్వీట్ చేసింది. మరి చూడాలని ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందని అనేది.

  English summary
  RRR makers to approach Andhra CM over ticket prices and say 'no intention of going to court'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X