Roar of RRR' Records: 24 గంటల్లో రికార్డు సృష్టించిన ఆ కష్టం నాది కాదు.. ఆ క్రెడిడంతా వీళ్ళేదే అంటూ రాజమౌళి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR ఒకటి. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మరోసారి క్లారిటీగా అర్ధమయ్యింది. రోర్ ఆఫ్ RRR అంటూ విడుదల చేసిన మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును అందుకుంది. ఇక ఆ కష్టం వెనకున్న వారి గురించి కూడా దర్శకుడు రాజమౌళి చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

క్లియర్ గా వివరణ ఇచ్చారు

క్లియర్ గా వివరణ ఇచ్చారు

జక్కన్న ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో పనిచేసిన వారికి తగిన గుర్తింపు రావాలని అనుకుంటారు. ఓపెన్ గా అందరి గురించి చెప్పేస్తుంటారు. ఇక ఇటీవల RRR మేకింగ్ వీడియోను కూడా విడుదల చేయగా దాని కోసం కష్టపడిన వారి గురించి కూడా జక్కన్న చాలా క్లియర్ గా వివరణ ఇచ్చారు.

ఆ కష్టం నాది కాదు

ఆ కష్టం నాది కాదు

ముందుగా మేకింగ్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ పై ఆనందం వ్యక్తం చేసిన జక్కన్న ఆల్ మోస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినంత సంతోషంగా ఉందని అన్నారు. అయితే ఈ మేకింగ్ వీడియో చూసి తనకి చాలా ప్రశంసలు వచ్చాయని కానీ ఆ కష్టం తనది కాదని ఓపెన్ గానే చెప్పేశారు. ఎక్కువగా తాను షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండాల్సి వచ్చిందని అన్నారు.

కార్తికేయ కొడుకు కూడా

కార్తికేయ కొడుకు కూడా

దాదాపు రెండు నెలల పాటు కష్టపడి ఈ మేకింగ్ వీడియోను రెడీ చేసినవారు వేరే ఉన్నట్లు వారిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ముందుగా రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మేకింగ్ రెడీ చేయడంలో ముందు ఉన్నాడు. అలాగే ఎడిటర్ వంశీ అట్లూరి, డిజిటల్ మీడియా మేనేజర్ ప్రదీప్ కూడా కష్టపడినట్లు చెప్పారు.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసిన వాళ్ళు వీరే..

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేసిన వాళ్ళు వీరే..

రోర్ ఆఫ్ RRR మేకింగ్ వీడియోలో అన్నటికంటే ఎక్కువగా హైలెట్ అయ్యింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయంలో వర్క్ చేసిన అచ్చు రాజమని, ర్యాపర్ బ్లేజ్, సింగర్ ఆదిత్య అయ్యంగార్ కు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో ఫుటేజ్ మొత్తం షూట్ చేసిన శ్రీనివాస్ కు కూడా రాజమౌళి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు.

Recommended Video

Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
24గంటల్లో సరికొత్త రికార్డు

24గంటల్లో సరికొత్త రికార్డు

ఇక గురువారం 11గంటలకు విడుదలైన రోర్ ఆఫ్ RRR యూ ట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూవ్స్ అందుకుంది. 24 గంటల్లో అత్యధికంగా 6.20+ మిలియన్ వ్యూవ్స్, 452K లైక్స్ అందుకున్న మేకింగ్ విడియోగా RRR సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈ రేంజ్ లో క్లిక్కవుతుందని ఎవరు ఊహించలేదు. ఇక సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయడానికి సిద్ధమైనట్లు క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X