For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి మరో అదిరిపోయే అప్డేట్.. ఈసారి సౌండ్ మామూలుగా ఉండదు!

  |

  ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్థాయిని ఒక్కసారిగా పెంచేసిన ఏకైక తెలుగు దర్శకుడు రాజమౌళి. అలాంటి దర్శకుడు నుంచి రాబోతున్న తరువాత సినిమా RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అత్యధిక భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా మార్కెట్లోకి రాబోతోంది. దాదాపు బిజినెస్ డీల్స్ అన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. కరోనా వాతావరణం అనుకూలిస్తే సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ వైరస్ ఎప్పటికప్పుడు కంగారు పెడుతూనే ఉంది. థర్డ్ వేవ్ భయంతో ఇప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లు టాక్ వస్తోంది. అయితే కరోనా ఎంత భయపెట్టినా కూడా ప్రమోషన్స్ విషయంలో మాత్రం దర్శకుడు రాజమౌళి అస్సలు వెనుకడుగు వేయడం లేదు. ఎప్పటికప్పుడు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసే విధంగా ప్లాన్స్ ఐతే వేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది.

  RRR వచ్చిన తరువాత

  RRR వచ్చిన తరువాత

  మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నందమూరి హరికృష్ణ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇది. ఇరు వర్గాల అభిమానులకు ఈ సినిమా ఎంతో ప్రత్యేకం. RRR వచ్చిన తరువాత తప్పకుండా ఇండస్ట్రీలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా మరిన్ని మల్టీ స్టార్ హీరోల సినిమాలు పుట్టుకొస్తాయని చెప్పవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ బిజీ బిజీగా వర్క్ చేస్తోంది.

  మరో అడుగు ముందుకు వేసి..

  మరో అడుగు ముందుకు వేసి..

  ఇక సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఇటీవల విడుదల చేయగా అన్ని భాషల్లోనూ మంచి క్రేజ్ ను అందుకుంది. తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఐదు రకాల సింగర్స్ తో దోస్తీ పాటను భారీగానే రిలీజ్ చేయించారు. మొత్తానికి ఈ సినిమా ప్రమోషన్ లో మరో అడుగు ముందుకు వేసినట్లు అర్థమయింది.

  అక్టోబర్ 13న వచ్చే ఛాన్స్ లేదు..?

  అక్టోబర్ 13న వచ్చే ఛాన్స్ లేదు..?

  ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయాలని మొన్నటి వరకు రెగ్యులర్ పోస్టర్స్ లో చెప్పకనే చెప్పారు. కాని ప్రస్తుత పరిస్థితులలో ఈ సినిమా అక్టోబర్ 13న వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉగాదికి రావచ్చని మరొక టాక్ వస్తోంది. ఇక సినిమా ఇప్పట్లో వచ్చినా రాకపోయినా కూడా విడుదల అయ్యే వరకు ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గకూడదని రాజమౌళి టీమ్ పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతోంది.

  వచ్చే నెలలో మరొక స్పెషల్ అప్డేట్

  వచ్చే నెలలో మరొక స్పెషల్ అప్డేట్

  విడుదల ఆలస్యం అయిన కూడా అప్ డేట్స్ విషయంలో మాత్రం కొంచెం కూడా ఆలస్యం అవ్వకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇక వచ్చే నెలలో మరొక స్పెషల్ అప్డేట్ రానున్నట్లు ఇండస్ట్రీలో టాక్ అయితే వైరల్ అవుతోంది. ఒక ప్రమోషన్ డైలాగ్స్ తో ఉండే ప్రోమోను విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అందులో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా అద్భుతమైన డైలాగ్స్ తో ఇరువర్గాల అభిమానులకు మంచి కిక్ ఇస్తారని తెలుస్తోంది. సినిమాలో ఉండే అతి కీలకమైన డైలాగ్స్ తోనే సినిమాపై అంచనాలు మరింత పెంచాలని అనుకుంటున్నారట. ఇక సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని టాక్ అయితే వస్తోంది. మరి ఆ అప్డేట్ అభిమానుల అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.

  English summary
  RRR movie Another special surprise for mega nandamuri fans,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X