twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR రికార్డుల కోత మొదలైంది.. ప్రపంచంలోనే అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న ఇండియన్ సినిమా!

    |

    రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టిస్టారర్ మూవీ త్రిబుల్ ఆర్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా అనంతరం తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడు వెండితెరపై చూస్తామా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చాలా ఓపెన్ గా చెప్పేశారు.

    మల్టీస్టారర్ సినిమాలకు మాత్రమే కాకుండా టాలీవుడ్ మార్కెట్ స్థాయిని కూడా ఈ సినిమా మరింత గుర్తింపు అందిస్తుంది అని చెప్పవచ్చు. ఇక RRR సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అవుతోంది.

    పాత్రలతోనే మ్యాజిక్

    పాత్రలతోనే మ్యాజిక్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందని ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే ఇప్పటికే తొమ్మిది వందల కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోలకు సంబంధించిన టైమింగ్ ను సమానంగా సెట్ చేసిన ఈ దర్శకుడు అలాగే అజయ్ దేవగన్ పాత్రతో కూడా ఈ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం.

    సినిమాలోని ప్రతి పాత్ర కూడా..

    సినిమాలోని ప్రతి పాత్ర కూడా..

    అలియా భట్ రోల్ కూడా ఈ సినిమాలో చాలా కీలకం కానుంది. తప్పకుండా సినిమాలోని ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతాయి అని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ లో తెలియజేశారు. ఇక రాజమౌళి కూడా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను ఇటీవల మొదలుపెట్టారు. జక్కన్న ఎక్కడికి వెళ్ళినా కూడా సినిమాకు సంబంధించిన అనేక విషయాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు.

    10వేల స్కీన్స్ లలో..

    10వేల స్కీన్స్ లలో..

    కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో కూడా RRR సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న భారతీయ సినిమా RRR సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. వరల్డ్ వైడ్ గా దాదాపు 10 వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారత దేశానికి సంబంధించిన ఏ సినిమా కూడా ఆ స్థాయిలో విడుదల కాలేదు.

    Recommended Video

    RRR రికార్డుల కోత Indian Cinema History లోనే మొదటగా | వరల్డ్ వైడ్ Record || Filmibeat Telugu
    యూఎస్ లో కూడా..

    యూఎస్ లో కూడా..

    అన్ని అనుకున్నట్లు జరిగితే అమెరికాలో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయనున్నారు.. యూఎస్లో మొత్తంగా 2,500 స్క్రీన్ లలో RRR సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. మొదటి రోజే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని ఈజీగా చెప్పవచ్చు. సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సంక్రాంతి సీజన్ లో చాలా ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా అందుకుంటుంది. ఇక RRR సినిమాను జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన పాటలు కూడా ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

    English summary
    RRR movie biggest release in indian cinema
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X