Bheemla Nayak రికార్డు బ్రేక్ చేయలేకపోయిన RRR: రాజమౌళి పొరపాటు వల్లే ఇలా జరిగిందా!

కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కాకుండా.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోన్న చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం.. ఈ చిత్రాన్ని ఇండియానే మెచ్చిన డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తుండడమే. అంతేకాదు, ఇందులో టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండడమూ కూడా. వీళ్లతో పాటు ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేశారు. ఇవన్నీ పక్కన పెడితే విడుదలకు ముందే ఈ చిత్రం భారీ బజ్‌ను ఏర్పరచుకుంది. ఇలా ఎన్నో అంచనాలతో మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ ఓ విషయంలో 'భీమ్లా నాయక్' రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. ఆ వివరాలు మీకోసం!

బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న RRR

బిగ్ మల్టీస్టారర్‌గా వస్తున్న RRR

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా చేశారు. ఇందులో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు. ఇది మార్చి 25న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

అంచనాలు పెంచిన అప్‌డేట్స్

అంచనాలు పెంచిన అప్‌డేట్స్

ప్రకటన సమయం నుంచే RRR మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది వచ్చినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మరీ ముఖ్యంగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్‌కు దేశ వ్యాప్తంగా స్పందన దక్కింది. అలాగే, ఈ చిత్రంలోని పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పేరిట ఎన్నో రికార్డులు సైతం నమోదు అయ్యాయి.

ప్రభుత్వాల సహకారంతో రచ్చ

ప్రభుత్వాల సహకారంతో రచ్చ

తెలుగు సినీ ఇండస్ట్రీకి టికెట్ రేట్ల తగ్గింపు అనే అంశం పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. అయితే, RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విషయంలో ఆ అడ్డంకులు తొలిగిపోయాయి. ఏపీలో రేట్లు పెంచుకునే వెసలుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాగే, చాలా ఏరియాల్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా.. అన్ని చోట్ల ఇప్పటికే టికెట్లన్నీ కొనేసి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

ప్రమోషన్స్ షురూ.. ఫుల్ బిజీగా

ప్రమోషన్స్ షురూ.. ఫుల్ బిజీగా


RRR (రౌద్రం రణం రుధిరం) విడుదలకు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లోనే ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను విస్తృతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను నిర్వహించగా.. ఇప్పుడు ఉత్తరాదిలోనూ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు కలిసి పర్యటనలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

అదిరిన ఈవెంట్... సీఎం రాక

అదిరిన ఈవెంట్... సీఎం రాక

బడా మల్టీస్టారర్‌గా వస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) రిలీజ్‌కు సమయం దగ్గర పడడంతో కర్నాటకలోని చిక్‌ బల్లాపూర్‌లో గత శనివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఫ్యాన్స్ వేలాదిగా తరలి వచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా కర్నాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, శివరాజ్‌కుమార్ విచ్చేశారు. పలువురు ప్రముఖులూ హాజరయ్యారు.

భీమ్లా రికార్డు బ్రేక్ చేయని RRR

భీమ్లా రికార్డు బ్రేక్ చేయని RRR

RRR (రౌద్రం రణం రుధిరం) ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తైన తర్వాత ఓ రికార్డు తెరపైకి వచ్చింది. ఈ ఈవెంట్‌ను లైవ్‌లో 153K మంది వీక్షించారు. ఇది టాలీవుడ్‌లో రెండో అత్యధికం మాత్రమే. దీనికంటే ముందు ‘భీమ్లా నాయక్' ఈవెంట్ 184K వ్యూస్‌తో మొదటి స్థానంలో ఉంది. ఈ రెండు ఈవెంట్లకు ఆయా సినిమా నిర్మాణ సంస్థల సింగిల్ ఛానెల్ ద్వారా వచ్చిన వ్యూసే.

Recommended Video

Bheemla Nayak Collections 100 కోట్ల షేర్ సాధించిన భీమ్లా నాయక్ | Filmibeat Telugu
రాజమౌళి పొరపాటు వల్లే ఇలా

రాజమౌళి పొరపాటు వల్లే ఇలా

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ వ్యూస్‌లో మాత్రం భీమ్లా నాయక్‌ను దాటలేకపోయింది. అయితే, ఈ ఫంక్షన్‌ను బెంగళూరులో నిర్వహించాలని రాజమౌళి తీసుకున్న నిర్ణయం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడిది హాట్ టాపిక్ అయిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X