RRR: హాలీవుడ్ మూవీలకు షాకిచ్చిన ఆర్ఆర్ఆర్.. ప్రపంచంలోనే టాప్ ప్లేస్‌తో సంచలన రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. దేశంలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. తన దర్శకత్వ ప్రతిభతో అందరినీ టాలీవుడ్ వైపు చూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఫలితంగా విడుదలకు ముందే తారాస్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని.. ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా అత్యధికంగా జరుపుకుంది. ఇలా భారీ హైప్‌తో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా RRR మూవీ అరుదైన రికార్డును క్రియేట్ చేసి.. ప్రపంచంలోనే టాప్ 5కి చేరింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

దేశంలోనే భారీ మల్టీస్టారర్‌గా RRR
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). రాజమౌళి రూపొందించిన ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. దీనికి కీరవాణి సంగీతాన్ని ఇచ్చారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇక, విప్లవ వీరుల కథతో వచ్చిన ఈ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలు చేశారు.

ఆరంభం నుంచీ అదే రెస్పాన్స్‌తో
భారీ మల్టీస్టారర్ మూవీ కావడంతో RRR (రౌద్రం రణం రుధిరం) ఆరంభం నుంచే అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు అనుగుణంగానే ప్రీ రిలీజ్ బిజినెస్‌ను రికార్డు స్థాయిలో జరుపుకుని గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని ప్రాంతాల్లో దీనికి భారీ స్పందన దక్కుతోంది. మొదటి నుంచే ఒకే రకమైన వసూళ్లతో ఇది సత్తా చాటుతోంది. దీంతో ఈ సినిమా పేరు మారుమ్రోగుతూనే ఉంది.

11 రోజుల్లోనే రూ 900 కోట్ల వసూళ్లు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన RRR (రౌద్రం రణం రుధిరం) ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. ఇది అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఫలితంగా ఈ మూవీకి కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. దీంతో 11 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 509.48 కోట్లు షేర్, రూ. 920 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసి సత్తాను చాటింది.

టార్గెట్ చేరుకుని... కోట్లు లాభాలు
భారీ బడ్జెట్‌తో రూపొందిన RRR మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 453 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 509.48 కోట్లు వసూలు చేసింది. ఫలితంగా ఇప్పటికే రూ. 56.48 కోట్ల లాభాలను కూడా ఖాతాలో వేసుకుంది.

ప్రతిరోజూ రికార్డులు.. ట్రెండింగ్‌లో
ఇద్దరు బడా హీరోలు.. అందునా దేశమే మెచ్చిన దర్శకుడు కలిసి చేసిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ అందరి నమ్మకాలను నిజం చేస్తూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఆల్‌టైం రికార్డులు క్రియేట్ చేసింది. అలాగే, ఇండియా, ఓవర్సీస్‌లోనూ సత్తా చాటింది. ఫలితంగా ఈ సినిమా పేరు అప్పటి నుంచి ట్రెండ్ అవుతూనే ఉంటోంది.

ప్రపంచంలోనే 5వ స్థానం సొంతం
సినిమాలకు రేటింగ్‌లు, రివ్యూలు ఇచ్చే ప్రముఖ సంస్థ IMDB తాజాగా 2022 మోస్ట్ పాపులర్ చిత్రాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఆస్కార్ అవార్డును అందుకున్న CODA మూవీ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత Death on the Nile, Morbius, The Batman ఉన్నాయి. ఇక, ఐదో స్థానంలో మన RRR మూవీ చోటు దక్కించుకుని రికార్డు సృష్టించింది.
Recommended Video


రేటింగ్‌లో వరల్డ్ రికార్డు కొట్టేసింది
IMDB తాజాగా విడుదల చేసిన చిత్రాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) ఐదో స్థానంలో ఉన్నప్పటికీ.. రేటింగ్‌లో మాత్రం ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. దీనికి 9.0 రేటింగ్ దక్కగా.. The Batman చిత్రానికి 8.3 రేటింగ్, CODA మూవీకి 8.1 రేటింగ్, Death on the Nile సినిమాకు 6.4 రేటింగ్, Morbius ఫిల్మ్‌కు 5.2 రేటింగ్ మాత్రమే దక్కడం గమనార్హం.


Click it and Unblock the Notifications











