twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR movie Highlight Scenes..రాజమౌళి టేకింగ్ మైండ్ బ్లోయింగ్.. ఆ హీరో తల్లిదండ్రులుగా అజయ్ దేవగన్, శ్రియ

    |

    దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూసిన RRR చిత్రం అన్ని రకాల విఘ్నాలను ఎదురించి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలకు తెలంగాణ, ఏపీలో అనుమతుల్లేవు. కానీ కర్ణాటక, యూఎస్, ఉత్తరాదిలో ప్రీమియర్ షోలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే RRR కు సంబంధించిన హైలెట్స్ సీన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమోషల్ అవుతున్నారు. ఆ సీన్ల వివరాల్లోకి వెళితే..

    గిరిజన యువతిని బ్రిటీషర్లు..

    గిరిజన యువతిని బ్రిటీషర్లు..

    RRR మూవీ ఓ గిరిజన యువతిని బ్రిటీషర్లు ఎత్తుకెళ్లే సీన్‌తో మొదలవుతుంది. పోలీస్ స్టేషన్ వద్ద రాంచరణ్ గ్రామస్తులతో తలపడే యాక్షన్ సీన్‌ ఆరంభంలోనే కిక్ ఎక్కిస్తుంది. ఇక అదిలాబాద్ అడవుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో అదుర్స్ అనిపిస్తుంది. రాజమౌళి మార్కు ప్రతీ సీన్‌లోను కనిపిస్తుంది.

    భీమ్‌ను పట్టుకొనేందుకు రామ్ ప్లాన్

    భీమ్‌ను పట్టుకొనేందుకు రామ్ ప్లాన్


    ఇక భీమ్ (ఎన్టీఆర్‌ను పట్టుకొనేందుకు) పోలీస్ ఆఫీసర్ రామరాజ్ (రాంచరణ్) వల పన్నుతాడు. కథలో భాగంగా రెస్కూ ఆపరేషన్‌లో తొలిసారి రామ్, భీమ్ కలుసుకొంటారు. ఆ తర్వాత కథలో దోస్తి సాంగ్ రాజమౌళి మార్క్‌తో సాగుతుంది. సినిమాలో ఈ పాట ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను పెంచుతుంది.

    అఖ్తర్‌గా ఎన్టీఆర్.. జెన్నీగా ఓవిలియా

    అఖ్తర్‌గా ఎన్టీఆర్.. జెన్నీగా ఓవిలియా


    అమాయకుడిగా ఎన్టీఆర్ క్యారెక్టర్ వినోదాన్ని పండిస్తూ సరదాగా సాగుతుంది. అఖ్తర్ (ఎన్టీఆర్), జెన్నీ (ఓలివియా) మధ్య కొన్ని సన్నివేశాలు రొమాంటిక్‌గా సాగుతూ ముందుకెళ్తుంది. రామ్, భీమ్ మధ్య ఫ్రెండ్ షిప్ సీన్స్ కథకు మరింత బలంగా మారుతాయి. ఇక ఇంటర్వెల్ సీన్ రాజమౌళి అనుసరించే అత్యుత్తమ ప్రమాణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీన్‌తో తొలిభాగం ముగుస్తుంది.

    రాజమౌళి కథ చెప్పిన విధానం

    రాజమౌళి కథ చెప్పిన విధానం


    మెగా, నందమూరి అభిమానుల అంచనాలకు తగినట్టే RRR ఫస్టాఫ్ సాగింది. రాజమౌళి కథ చెప్పే విధానం సినిమాకు హైలెట్స్‌గా నిలిచాయి. ఫస్టాఫ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌, యాక్షన్ సీన్లతో రంజుగా సాగుతుంది. సగటు ప్రేక్షకుడికి థ్రిలింగ్ కలిగించే సినిమా RRR.

    తల్లిదండ్రులగా అజయ్ దేవగన్, శ్రీయ

    తల్లిదండ్రులగా అజయ్ దేవగన్, శ్రీయ


    ఇక సెకండాఫ్‌ ఫ్లాష్ బ్యాక్‌తో కథ ప్రారంభమవుతుంది. రాంచరణ్ తల్లిదండ్రులుగా అజయ్ దేవగన్, శ్రీయ కనిపిస్తారు. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ రొటీన్‌గా కనిపిస్తుంది. అజయ్ దేవగన్, శ్రీయ పాత్రలను రాజమౌళి మంచిగా తీర్చిదిద్దారు.

    బ్రిటీషర్ల నుంచి భీమ్ తప్పించుకొనే సీన్

    బ్రిటీషర్ల నుంచి భీమ్ తప్పించుకొనే సీన్


    సెకండాఫ్‌లో ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా కనిపిస్తాడు. పాటతో ప్రారంభమయ్యే కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ తన నటనతో ఆకట్టుకొంటారు. బ్రిటీషర్ల కస్టడీ నుంచి భీమ్ తప్పించుకొనే సీన్ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో రామ్, భీమ్ పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి.

    ఆలియా భట్ ఎంట్రీతో

    ఆలియా భట్ ఎంట్రీతో

    బ్రీటీషర్ల కస్టడీలో జైలు నుంచి పారిపోయిన భీమ్ కోసం వెతుకులాట మొదలవుతుంది. సెకండాఫ్‌లో సీత (ఆలియాభట్) పాత్ర ఎంట్రీ ఇస్తుంది. సీత చెప్పిన ఓ వాస్తవం ఆధారంగా రామ్, భీమ్ ఇద్దరు ఏకం అవుతారు. ఆతర్వాత 30 నిమిషాలు చాలా స్లోగా సాగుతుంది. భీమ్‌కు సహకరించారనే కారణంతో చరణ్‌ను బ్రిటీషర్లు జైలులో బంధిస్తారు. ఆ తర్వాత చరణ్ జైలు నుంచి తప్పించుకొనే సీన్‌తో సినిమాలో ఊపు అందుకొంటుంది.

    అల్లూరి సీతారామారాజు గెటప్‌తో

    అల్లూరి సీతారామారాజు గెటప్‌తో


    అల్లూరి సీతారామారాజు గెటప్‌తో రాంచరణ్ మరో ఎంట్రీ మొదలవుతుంది. బ్యాక్ గ్రౌండ్‌లో రామమ్ రాఘవమ్ పాట తెర మీద అద్భుతంగా ఉంటుంది. సీతారామరాజు ఎంట్రీతో కథ మరో లెవెల్‌కు చేరుతుంది.

    English summary
    Ram Charan, Jr NTR's, SS Rajamouli's RRR hits the screen. Here is the premier show talk report.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X