Komuram Bheemudo Promo: RRR నుంచి మరో సర్‌ప్రైజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కన్నుల పండగే

తెలుగు సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో, క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బడా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు పన్నెండు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

భారీ స్థాయిలో రాబోతున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీపై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇండియాలోనే నెంబర్ వన్ సినిమాగా ఇది ఘనతను కూడా అందుకుంది. ఆ రేంజ్‌కు తగ్గట్లుగానే ఈ సినిమాను రికార్డు స్థాయిలో అంటే అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇలా కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది.

RRR Movie Komuram Bheemudo Promo Out

RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందుకోసం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల ట్రైలర్‌ల కోసం వేరు వేరుగా ప్రెస్‌మీట్లు కూడా నిర్వహించారు. అలాగే, ముంబైలో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇక, త్వరలోనే తెలుగులో కూడా పెద్ద ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలైన విషయం తెలిసిందే. అన్నింటికీ భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు సైతం బద్దలయ్యాయి. ఈ క్రమంలోనే దీని నుంచి మరో పాట రాబోతుంది. ఈ మేరకు తాజాగా చిత్ర యూనిట్ 'కొమరం భీముడో' అంటూ సాగే ఓ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను కాల భైరవ ఆలపించాడు. దీనికి విజువల్స్, కాన్సెప్టును ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడు. ఇక, ఈ పూర్తి పాట డిసెంబర్ 24, సాయంత్రం 4 గంటలకు విడుదల కాబోతుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఇది జనవరి 7న విడుదల కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X