For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR update: తొలిసారి విదేశాల్లో రాజమౌళి టీమ్.. యుద్ద పోరాటాల కోసం ఎక్కడికి వెళ్లిందంటే..

  |

  దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR చిత్రం విడుదలకు ముందే ఓ రకంగా రికార్డులు, మరో రకంగా ఆసక్తికరమైన విషయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. టీజర్లు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లు విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను రోజు రోజుకు పెంచుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో సినిమా సన్నివేశాలను భారీ స్థాయిలో చిత్రీకరించారు. అయితే ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నది. రాజమౌళి టీమ్ ఎక్కడికి వెళ్తున్నదంటే..

  క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన యాంకర్ మంజూష.. రష్మీ, అనసూయకు పోటీ ఇచ్చేలా హాట్ స్టిల్స్

  హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాలు

  హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాలు

  రాజమౌళి కెరీర్ కీలక సన్నివేశాలను దాదాపు హైదరాబాద్ లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనే చిత్రీకరించిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా చిత్రం RRRకు సంబంధించిన షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే పూర్తి చేశారు. కొన్ని సన్నివేశాలను, ఎపిసోడ్స్‌ను ఉత్తర భారతంలో చిత్రీకరించారు. అయితే కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా కొన్ని ప్రదేశాల్లో షూటింగ్‌ను మానుకొన్నారు. ఈ మేరకు సెకండ్ వేవ్ తర్వాత హైదరాబాద్‌లోని అల్యుమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశారు. సెకండ్ వేవ్ కోవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు దాదాపు ఈ షూటింగును 50 రోజులపాటు నిర్విరామంగా జరిపారు.

  పోర్న్ రాకెట్ నటి గెహానా వశిష్ట్ కళ్ళు చెదిరే ఫోటోలు.. మరీ ఇంతలా అందాల ఆరబోతా ?

  ఫ్రెండ్‌షిప్ డే రోజున సాంగ్‌కు మంచి రెస్సాన్స్

  ఫ్రెండ్‌షిప్ డే రోజున సాంగ్‌కు మంచి రెస్సాన్స్

  ఇక RRR చిత్రంపై క్రేజ్ పెంచడానికి ప్రమోషన్ పరంగా చర్యల తీసుకొంటూనే ఇతర పనులను పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఫ్రెండ్‌షిప్ డే రోజున విడుదల చేసిన దోస్తి పాటకు మంచి స్పందన వచ్చింది. తెలుగు, మలయాళ, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసిన పాటకు మంచి స్పందన లభించింది. ఈ పాటకు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, హిందీలో అమిత్ త్రివేదీ సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాట ఫ్రెండ్‌షిప్ డే సాక్ష్యంగా నిలిచే పాట ఇది. రామరాజు, భీమ్ ఇద్దరు హోరాహోరీగా తలపడే విధంగా ఉంటుంది అని రాజమౌళి ట్వీట్ చేశారు.

  సాయి పల్లవిని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

  విదేశాల్లో షూటింగ్‌కు రాజమౌళి ప్లాన్

  విదేశాల్లో షూటింగ్‌కు రాజమౌళి ప్లాన్

  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండటం, అలాగే అనుకొన్న రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటడటంతో RRR మూవీ షూటింగును పూర్తి చేసే ఆలోచనలో దర్శకుడు రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య సమరం నేపథ్యంలో సాగే కొన్ని పోరాట సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు.

  Ashnoor Kaur సీబీఎస్‌ఈలో 94శాతంతో టాప్ లేపిన యువ హీరోయిన్.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ ఫోటోలు

  ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌

  ఉక్రెయిన్‌లో చివరి షెడ్యూల్‌

  ప్రస్తుతం రాజమౌళి టీమ్ మొత్తం ఉక్రెయిన్‌లో షూటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నట్టు RRR అధికార ట్విట్టర్ అకౌంట్ నుంచి సమాచారాన్ని అందించారు. ఉక్రెయిన్‌లో 1920లో జరిగే స్వాతంత్ర్య పోరాటాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ మేరకు తాము ఉక్రెయిన్‌కు వెళ్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్, రాంచరణ్‌పై కీలక సన్నివేశాలను, బ్రిటీష్ వారితో యుద్దానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు

  ఘాటు ఫొటోలతో పవన్ హీరోయిన్ రచ్చ: హద్దు దాటేసి మరీ అందాలు ఆరబోత.. చూస్తే షాక్ అవుతారు!

  అగ్రతారలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ

  అగ్రతారలపై కీలక సన్నివేశాల చిత్రీకరణ

  RRR సినిమాకు కీలకంగా మారే ఎపిసోడ్స్‌ను, అగ్రతారల మధ్య కీలక సన్నివేశాలను ఉక్రెయిన్‌లో షూట్ చేయడానికి ప్లాన్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. RRR సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ఇదే. ఈ షెడ్యూల్‌ను పూర్తి చేస్తే సినిమా షూట్ పూర్తవుతుంది. ఇక ముందు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులపై దృష్టిపెట్టనున్నాం అని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎన్నో అవాంతరాల మధ్య ఎట్టకేలకు షూటింగ్ పూర్తయ్యే స్టేజ్‌కు రావడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు సంతోషంలో మునిగిపోయారు.

  Katrina Kaif నాలుగు పదుల వయసులో తగ్గని గ్లామర్ డోస్.. లేటేస్ట్ ఫోటోలు వైరల్!

  అక్టోబర్ 13వ తేదీన రిలీజ్

  అక్టోబర్ 13వ తేదీన రిలీజ్

  RRR సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత పలు మార్లు రిలీజ్ వాయిదా పడింది. కరోనా ఫస్ట్ వేవ్; సెకండ్ వేవ్, లాక్‌డౌన్స్ ఈ సినిమా రిలీజ్‌ను అడ్డుకొన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు సానుకూలంగా ఉండటంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతా సవ్యంగా ఉంటే దసరాకు RRR థియేటర్లలో సందడి చేసే అవకాశం ఉంది.

  Dhee Fame Deepika Pilli అందాల విందు.. మోడ్రన్ డ్రెస్‌లో ఇలా ఎప్పుడైనా చూశారా?

  Ram Pothineni Birthday Wishes TO Devi Sri Prasad | #RAPO | HBD DSP
  నటీనటులు: సాంకేతిక నిపుణులు

  నటీనటులు: సాంకేతిక నిపుణులు

  నటీనటులు: ఎన్టీఆర్, రాంచరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, శ్రీయ సరన్, ఓలియా మోరిస్, అలిసన్ డూడీ,, రే స్టీవెన్‌సన్ తదితరులు
  దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
  నిర్మాత: డీవీవీ దానయ్య
  డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
  సినిమాటోగ్రఫి: కేకే సెంథిల్ కుమార్
  ఎడిటింగ్: ఏ శ్రీకర్ ప్రసాద్
  మ్యూజిక్: ఎంఎం కీరవాణి
  బ్యానర్: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
  డిస్ట్రిబ్యూషన్: లైకా ప్రొడక్షన్స్ (తమిళం), పెన్ స్టూడియోస్ (నార్త్)
  రిలీజ్ డేట్: 2021-10-13

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  RRR account tweted that Team #RRRMovie arrives in #Ukraine for the last schedule of the film… Excited. Earlier, After second wave of covid, Mega power star Ram Charan and Young tiger NTR joined SS Rajamouli's RRR Shoot after lockdown lift in Telangana. Report suggest that This shoot will be completed in August. Unit is planning to release this movie on October 13.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X