ఎన్టీఆర్, చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మొదలైంది: మెగాస్టార్ క్లాప్, ప్రభాస్ సందడి (ఫోటోస్)

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ మూవీ ఆదివారం ఉదయం 11.11 గంటలకు లాంచనంగా ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వివి వినాయక్‌, కొరటాల శివ, ప్రభాస్, రానాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. అనంతరం దర్శకేంద్రుడు రాఘవేంద్రావు..... రాజమౌళి(ఆర్), రామారావు(ఆర్), రామ్ చరణ్(ఆర్)లకు తన చేతుల మీదుగా స్క్రిప్టు అందించి ఆశీర్వదించారు.

క్లాప్ కొడుతున్న మెగాస్టార్

11వ నెల, 11వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు సినిమా ప్రారంబోత్సవానికి ముహూర్త పెట్టారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు.

రేర్ కాంబినేషన్ సెట్ చేసిన రాజమౌళి

రేర్ కాంబినేషన్ సెట్ చేసిన రాజమౌళి

బాహుబలి తర్వాత ఆ స్థాయికి తగిన విధంగా సినిమా ప్లాన్ చేసిన రాజమౌళి.... ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలయికతో రేర్ కాంబినేషన్ సెట్ చేశారు. మెగా, నందమూరి అభిమానుల సపోర్టుతో ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందో ఎవరూ ఊహించలేక పోతున్నారు.

దర్శకేంద్రుడి ఆశీర్వాదం

దర్శకేంద్రుడి ఆశీర్వాదం

దర్శకేంద్రుడు రాఘవేంద్రావు..... రాజమౌళి(ఆర్), రామారావు(ఆర్), రామ్ చరణ్(ఆర్)లకు తన చేతుల మీదుగా స్క్రిప్టు అందించి ఆశీర్వదించారు.

ఆసక్తికర ప్రచారం...

ఈ సినిమా ఎలా ఉండబోతోంది? కథ ఏమిటనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇది 1920 నాటి కథాంశంతో సాగుతుందనే ఆసక్తికర ప్రచారం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుందని అంటున్నారు. ఇందులో దేశ భక్తులుగా చరణ్, ఎన్టీఆర్ కనిపించబోతున్నారని టాక్.

చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవేనా?

చరణ్, ఎన్టీఆర్ పాత్రలు ఇవేనా?

బ్రిటిష్ వారి సంపదను కొల్లగొట్టే దొంగ పాత్రలో ఈ చిత్రంలో ఎన్టీఆర్ కనిపిస్తారని, బ్రిటిష్ ప్రభుత్వంలో పని చేసే పోలీస్ పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తాడని... దేశ స్వాతంత్ర్యం కోసం ఇద్దరూ చేతులు కలుపుతారని తెలుస్తోంది.

రూ. 300 కోట్ల బడ్జెట్

రూ. 300 కోట్ల బడ్జెట్

రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు టాక్.

విజేంద్ర ప్రసాద్ కథ

విజేంద్ర ప్రసాద్ కథ

బాహుబలి సినిమాకు కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. 1920 కాలానికి సంబంధించి సెట్స్ గండిపేట ప్రాంతంలో నిర్మిస్తున్నారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఇక్కడే జరుగుతుందట.

ప్రభాస్, రానా సందడి

ప్రభాస్, రానా సందడి

ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానా సందడి చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X