RRR: ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు.. బుక్ మై షోలో బుకింగ్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న RRR సినిమా మార్చి 25వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు గా నటించగా నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలు, ఫ్యాన్స్ షోలు, బెన్ఫిట్ షోలు ఎప్పుడు ఉంటాయి? అలాగే ఆన్లైన్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయనే వివరాల్లోకి వెళితే..

ఎప్పుడెప్పుడు చూద్దామా అని..

ఎప్పుడెప్పుడు చూద్దామా అని..

రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ మాత్రమే కాకుండా మరొక ముఖ్యమైన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించగా ఓలివియా మారిస్ అతి ముఖ్యమైన క్యారెక్టర్లో సినిమాలో మరొక హైలెట్ గా నిలవబోతోంది.

దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా అభిమానుల అంచనాలకు మించి ఆలోచించాడు అనిపిస్తోంది. నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని 450కోట్లతో నిర్మించగా కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు 30కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఓవర్సీస్ లో భారీగా..

ఓవర్సీస్ లో భారీగా..

ఇదివరకే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా అలాగే కరోనా వలన ఐదు సార్లు వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడే అవకాశం అయితే లేదు. అయితే మార్చి 25 వ తేదీన విడుదల కాబోయే సినిమా ఒక రోజు ముందుగానే ఓవర్సీస్లో అయితే ప్రీమియర్ షోలకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. సాధారణంగా ఎలాంటి బిగ్ బడ్జెట్ తెలుగు సినిమా విడుదలైన కూడా ఓవర్సీస్లో అయితే ప్రీమియర్ షోలు ప్రత్యేకంగా ప్రదర్శించబడతాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమాలకు భారీగా డిమాండ్ ఉండడంతో అక్కడ మిలియన్ల డాలర్లను కేవలం ప్రీమియర్స్ లతోనే అందుకునే విధంగా పెద్ద సినిమాలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు

ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు

అయితే రాజమౌళి నిర్మాత డివివి దానయ్య ఈ సారి ఇండియా మొత్తంలో కూడా ప్రీమియర్ షోలలో భారీగా ప్రదర్శించాలని ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. అంటే మార్చి 24 వ తేదీన దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా ప్రీమియర్ షోలకు అనుమతులు తీసుకోబోతున్నారు అని తెలుస్తోంది.

మల్టీప్లెక్స్ లలో కూడా

మల్టీప్లెక్స్ లలో కూడా

అంటే మార్చి 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి అలాగే విడుదల తేదీ మార్చి 25 వ రోజు తెల్లవారుజామున కూడా RRR ప్రత్యేకమైన షోలు ప్రదర్శించబోతున్నారని సమాచారం ఎలాగో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ షోలో ఉంటాయి కాబట్టి మిగతా మల్టిప్లెక్స్ లలో కూడా ప్రీమియర్ షోలకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu
ఆడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

ఆడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?

ఇక RRR సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ లో అయితే సినిమా విడుదల నాలుగు లేదా ఐదు రోజుల ముందే ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బుక్ మై షోలో 19 లేదా 20వ తేదీ నుంచి అడ్వాన్స్ బూకింగ్స్ స్టార్ట్ అవుతాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X