twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబడ్డీ ఆటలో కూడా RRR ప్రమోషన్స్.. డైలాగ్స్ తో కౌంటర్లు ఇచ్చుకున్న చరణ్, తారక్

    |

    బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న RRR సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ అయితే మామూలుగా లేదు. దర్శకుడు రాజమౌళి బాహుబలి కంటే ఎక్కువగా ఈ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ దారిలో కూడా సినిమా స్థాయి పెరిగేలా చేస్తున్నారు. ఇటీవల భారీగా జనాదరణ పొందిన కబడ్డీ గేమ్ తో కూడా RRR సినిమా పై అంచనాలు పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

    ప్రో కబడ్డీలో RRR

    ప్రో కబడ్డీలో RRR

    ఇటీవల రాజమౌళి అలాగే సినిమా హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు కూడా ప్రో కబడ్డీ లీగ్ కు సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్నారు. కబడ్డీ గురించి మాట్లాడుతూ వారి అనుభవాలను ప్రత్యేకంగా తెలియజేశారు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఉన్నాయి.

    చరణ్ vs తారక్

    చరణ్ vs తారక్

    ముందుగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ లో కబడ్డీ కబడ్డీ అంటూ.. అమ్మతోడు మ్యాట్ పై ఆట అదిరిపోతుంది అని తెలియజేశాడు. ఇక మరో వైపు నుంచి వచ్చిన రామ్ చరణ్ తేజ్ ఈ మ్యాట్ పై ఆట నాదే.. వేట నాదే అని పవర్ ఫుల్ డైలాగ్ చెప్పడంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాతావరణం మారిపోయినట్లు అనిపించింది.

    మధ్యలో వచ్చిన రాజమౌళి

    ఇక మధ్యలోకి వచ్చిన రాజమౌళి నేను యాక్షన్ చెప్పకముందే మీరు ఇద్దరు కబడ్డీ ఆడేస్తున్నారు అంటూ ప్రశ్నించడంతో.. ఇది మీ సెట్ కాదు అని ఎన్టీఆర్ చరణ్ సరదాగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇంతలో వచ్చిన యాంకర్ వారి మాటల దూకుడుకు అడ్డుకట్ట వేసి ఎలాంటి గొడవలు లేకుండా ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్ ను ఒక పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని ఈ షోను ఒక మంచి వాతావరణంలో మొదలు పెట్టాలని చెప్పారు. ఇక ముగ్గురు కూడా 'లే పంగా' అంటూ తోడ కొట్టారు.

    గర్వించదగ్గ విషయం: చరణ్

    ఇక రామ్ చరణ్ తనకు కబడ్డీతో ఉన్న అనుబంధం గురించి వివరించారు. కబడ్డీ ఆట నేను చాలా తక్కువగా ఆడాను. అయితే అడినన్ని రోజులు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనం గర్వించదగ్గ విషయం ఏమిటంటే స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు మన ఇండియన్ ఆటను వేరే లెవెల్ కు తీసుకు వెళ్లారు. మన ఇండియాలో క్రికెట్ అలాగే టెన్నిస్ మాత్రమే చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు కబడ్డీకి కూడా ఎక్కువ స్థాయిలో ఆదరణ వస్తుండడం ఆనందించాల్సిన విషయం.. అని చరణ్ తెలియజేశాడు.

    Recommended Video

    2021 Year Ender: Best Telugu Movies Of 2021| Akhanda |Pushpa
    మన మట్టిలో పుట్టిన ఆట: ఎన్టీఆర్

    మన మట్టిలో పుట్టిన ఆట: ఎన్టీఆర్

    ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా కబడ్డీతో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. మన భారతీయ మట్టిలో పుట్టిన ఆట ఇది. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో కబడ్డీ ఆడేవాళ్ళం. కానీ ఈ రేంజ్ లో ఆడలేదు. ఇక ఇప్పుడు మన భారతీయ ఆటకు ఇంత గ్రాండ్ స్కెల్ లో రూపొందడం నిజంగా చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది అని ఎన్టీఆర్ తెలియజేశారు.

    English summary
    RRR movie promotion in pro kabaddi league
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X