ఆర్ఆర్ఆర్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్ ఇదేనా?
Recommended Video

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శక ధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' పేరుతో టాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోవడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్, వీడియోలు కూడా విడుదల చేశారు. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆహార్యం(లుక్) ఎలా ఉండబోతోంది? అనే అంశంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోస్ హాట్ టాపిక్ అయ్యాయి.
తారక్ ‘ఆర్ఆర్ఆర్’ లుక్ ఇదేనా?
ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ అభిమాని తారక్‌తో ఫోటో దిగారు. ఇందులో ఆయన గడ్డంతో డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఇదే యంగ్ టైగర్ ‘ఆర్ఆర్ఆర్' లుక్ అని అభిమానులు భావిస్తున్నారు.

లాయిడ్ స్టీవెన్స్ సమక్షంలో ఎన్టీఆర్ ట్రైనింగ్
‘ఆర్ఆర్ఆర్' సినిమాలో రాజమౌళి కోరుకున్న విధంగా తారక్ లుక్ తయారు చేసేందుకు ఇంటర్నేషనల్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ రంగంలోకి దిగారు. గతంలో అరవింద సమేత సినిమా విషయంలో సైతం తారక్ ఇతడి సమక్షంలోనే సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ చేసిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ లుక్ ఇదేనా?
‘ఆర్ఆర్ఆర్' సినిమా ఫస్ట్ డే షూటింగ్ సందర్భంగా ఉపాసన పోస్ట్ చేసిన ఫోటో బట్టి చూస్తే... రామ్ చరణ్ లుక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇలా ఉండబోతోందని తెలుస్తోంది.

సినిమా కాన్సెప్టు ఏమిటి?
అయితే ‘ఆర్ఆర్ఆర్' సినిమా కాన్సెప్ట్ ఏమిటి? అనేది ఇప్పటికీ సీక్రెట్‌గానే ఉంది. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. బ్రిటిష్ కాలం నాటి కథతో ఈ మూవీ సాగుతుందనే ప్రచారం సైతం తెరపైకి వచ్చింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.

120 కెమెరాలతో షూటింగ్
ఈ సినిమాలో రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటాయట. ఈ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏకంగా 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలుగు సిీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

4డి టెక్నాలజీతో చరణ్, తారక్ ఫేస్ కాప్చర్
యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హావభావాలు, ముఖకవళికలు 4డి టెక్నాలజీతో క్యాప్చర్ చేస్తారని తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట.


Click it and Unblock the Notifications











