వైరల్ అవుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ మూమెంట్.. నేలపై అలా పడుకుని.. ఫొటో వైరల్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గా ప్రస్తుతం అందరిని ఎక్కువగా ఆకట్టుకున్న వారిలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ RRR సినిమాలో కలిసి నటించిన ఈ స్టార్స్ అంతకంటే ముందే మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ సినిమాతో వీరి స్నేహం మరింత బలపడింది అనే చెప్పాలి. వీరికి సంబంధించిన ఒక ఫోటో ను చిత్ర యూనిట్ విడుదల చేయగా అది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇద్దరు కూడా ఆఫ్ స్క్రీన్ నేలపై అలా సేదతీరుతూ కనిపించారు. ఫోటోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఫైనల్ గా మార్చి 25న గ్రాండ్ రిలీజ్..

ఫైనల్ గా మార్చి 25న గ్రాండ్ రిలీజ్..

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా అనుకోకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఐదు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా మార్చి 25 వ తేదీన రాబోతోంది.

ప్రమోషన్స్ కోసమే 30కోట్లు..

ప్రమోషన్స్ కోసమే 30కోట్లు..


సంక్రాంతికే విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న ఈ సమయంలో అనుకోకుండా వాయిదా పడింది. ఆ సమయంలో ప్రమోషన్స్ కోసమే చిత్ర యూనిట్ సభ్యులు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా ఒక టాక్ వచ్చింది. వరుసగా ప్రెస్ మీట్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇంటర్వ్యూలు ఇలా భారీ స్థాయిలో ప్రణాళికలతో నిర్మాత గట్టిగానే ఖర్చు చేశారు.

 మరోసారి బిజీ అవ్వాలని..

మరోసారి బిజీ అవ్వాలని..

ఇక మార్చి 25వ తేదీన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయాలి అని చిత్ర యూనిట్ సభ్యులు బలంగా నిర్ణయించుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో మరోసారి బిజీ అవ్వాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే RRR యూనిట్ గ్యాప్ లేకుండా డిఫరెంట్ పోస్టర్స్ తో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 చేతిలో ఫోన్ పట్టుకొని..

చేతిలో ఫోన్ పట్టుకొని..

రీసెంట్ గా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఆఫ్ స్క్రీన్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయగా అది నిమిషాల్లోనే వైరల్ గా మారిపోయింది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా షూటింగ్ గ్యాప్లో అలా పచ్చని గడ్డి పై సేద తీరుతూ కనిపించారు. చేతిలో ఫోన్ పట్టుకొని ఇద్దరు ఎదో స్క్రోల్ చేస్తున్నట్లుగా ఉంది. సాధారణంగా నార్మల్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఉంటారో అదే విధంగా ఈ స్టార్ ఇద్దరు కూడా వారి స్నేహాన్ని కొనసాగించినట్లు క్లారిటీగా అర్థమైంది.

 మొదటి రోజే 100కోట్లు వచ్చే ఛాన్స్

మొదటి రోజే 100కోట్లు వచ్చే ఛాన్స్

RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఇక అజయ్ దేవ్ గన్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అలియా భట్ రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించింది. ఇక సినిమాలో సముద్రఖని కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా బాక్సాఫీస్ వద్ద తొలిరోజే వంద కోట్ల వసూళ్లను అందుకునే ఛాన్స్ ఉంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక సినిమాను 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X