For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేడే విడుదల కానున్న RRR మూవీ: భారీ మల్టీస్టారర్‌ విషయంలో అనుకున్నదే జరిగిందిగా!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం)ను ప్రముఖంగా చెప్పుకోవాలి. దీనికి కారణం టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలుగా వెలుగొందుతోన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో ఈ చిత్రం రాబోతుండడమే. అంతేకాదు, టాలీవుడ్ హిస్టరీలోనే అత్యధిక బడ్జెట్‌తో ఇది తెరకెక్కుతోంది. ఇలాంటి విశేషాలున్న ఈ సినిమా నేడు (జనవరి 8న) విడుదల కాబోతుంది. అదేంటి.. ఇది ఇప్పుడు రిలీజ్ అవడమేంటి అనుకుంటున్నారా? అయితే, పూర్తిగా చదవాల్సిందే.!

  RRR: Controversies Around Jr NTR's Komaram Bheem Look
  విప్లవ వీరులుగా ఇద్దరు స్టార్ హీరోలు

  విప్లవ వీరులుగా ఇద్దరు స్టార్ హీరోలు

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో చరణ్.. అల్లూరి గానూ, తారక్.. భీంగానూ నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్, బాలీవుడ్ సహా ఎంతో మంది నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఐదు భాషల్లో రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

  రెండేళ్లు గడిచినా.. అవన్నీ మిగిలాయి

  రెండేళ్లు గడిచినా.. అవన్నీ మిగిలాయి

  RRR రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే అవుతోంది. అయినప్పటికీ పలుమార్లు ఆటంకం ఏర్పడడం వల్ల ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తవలేదు. అంతేందుకు ఎంతో ముఖ్యమైన కాంబినేషన్ సీన్స్‌తో పాటు ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చిత్రీకరించలేదు. దీంతో ఈ మూవీ విడుదలను గతంలో వాయిదా వేసింది చిత్ర యూనిట్.

  అందంతో అదరగొడుతున్న బాలీవుడ్ హీరోయిన్.. అతి ఖరీదైన బ్యాగ్‌తో

  వాటన్నింటికీ మంచి రెస్పాన్స్.. రికార్డు

  వాటన్నింటికీ మంచి రెస్పాన్స్.. రికార్డు

  ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కొన్ని అప్‌డేట్లు మాత్రమే వచ్చాయి. మొదటిగా టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ ఇంట్రడక్షన్ వీడియో ‘భీం ఫర్ రామరాజు' విడుదలైంది. దీనికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ మధ్య వచ్చిన ఎన్టీఆర్ పరిచయ వీడియో అయితే రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టింది.

  మొత్తం మార్చేసిన మహమ్మారి వైరస్

  మొత్తం మార్చేసిన మహమ్మారి వైరస్

  కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. మరీ ముఖ్యంగా సినీ పరిశ్రమపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపించింది. సినిమా షూటింగులు ఆగిపోవడం.. థియేటర్లు మూతపడడంతో ఎంతో నష్టం వాటిల్లింది. ఇది RRR మూవీపై భారీగా పడిందనే చెప్పాలి. దీనికితోడు, రాజమౌళి, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇటీవల చిత్ర హీరో రామ్ చరణ్‌కు కూడా పాజిటివ్ వచ్చింది.

  శృంగారం ఒలకబోస్తున్న యువ హీరోయిన్.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా

  సంక్రాంతికి సర్‌ప్రైజ్ చేయనున్న టీమ్

  సంక్రాంతికి సర్‌ప్రైజ్ చేయనున్న టీమ్

  సంక్రాంతి సందర్భంగా RRR మూవీ నుంచి థీమ్ సాంగ్‌తో కూడిన వీడియోను విడుదల చేయబోతున్నారట. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఓలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ సహా సినిమాలో నటించిన ప్రతీ యాక్టర్‌ ఇందులో కనిపిస్తారట. అంతేకాదు, టెక్నికల్ టీమ్ రాజమౌళి అండ్ కో కూడా ఈ వీడియోలో సందడి చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

  నేడే విడుదల కానున్న RRR మూవీ

  నేడే విడుదల కానున్న RRR మూవీ

  వాస్తవానికి RRRను జూలై 30, 2020న విడుదల చే్తామని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించింది. కానీ, అప్పటికి షూటింగ్ పూర్తి కాకపోవడంతో జనవరి 8, 2021న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ప్రకటించారు. అంటే ఈరోజే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, అది సాధ్యమయ్య పని కాదని చాలా మంది అన్నారు. ఇప్పుడు ఈ విషయంలో అనుకున్నదే జరిగింది.

  English summary
  RRR is an upcoming Indian Telugu-language period action drama film written and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and Olivia Morris. It is a fictional story about India's freedom fighters, Alluri Sitarama Raju and Komaram Bheem.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X