RRR మూవీ సంచలన రికార్డు: ఇండియాలోనే ఏకైక సినిమాగా ఘనత.. వామ్మో ఆ దేశంలో కూడా ఈ రేంజ్‌లోనా!
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'బాహుబలి' వంటి భారీ హిట్ తర్వాత చేస్తున్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఎల్లలు దాటిపోయాయి. అందుకే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ మూవీ విడుదలకు ముందే ఓ సెన్సేషనల్ రికార్డును నమోదు చేసింది. తద్వారా ఇండియాలోనే మొదటి చిత్రంగా నిలిచింది. ఇంతకీ ఏంటా రికార్డు? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

రియల్ హీరోలుగా మారిన స్టార్లు
తెలుగు విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు. ఇది జనవరి 7న విడుదల కాబోతుంది.

ట్రైలర్‌తో నేషనల్ రికార్డు బ్రేక్
భారీ అంచనాల నడుమ ఇటీవల RRR మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్‌పై సామాన్యులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఈ ట్రైలర్‌కు ఫిదా అయిపోయారు.

ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లోనూ
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన విషయం తెలిసిందే. అయితే, దీన్ని ఇండియన్ లాంగ్వేజ్‌ల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. అలాగే, టర్కిష్, స్పానిష్, పోర్చుగీస్, కొరియన్, జపనీస్, చైనీస్, ఇంగ్లీష్ భాషల్లో కూడా దీన్ని డబ్బింగ్ చేయబోతున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనూ రికార్డ్స్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న RRR (రౌద్రం రణం రుధిరం)పై దేశ వ్యాప్తంగా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా ప్రభావం ఇండియన్ సినిమాపై భారీగా పడే అవకాశం ఉందని విశ్లేషకులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. గతంలో ఏ సినిమాకూ లేని విధంగా ఇది రికార్డులు క్రియేట్ చేసింది.

RRR మూవీ సంచలన రికార్డు
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది. దీంతో మన సినిమాలను కూడా వేరే దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే జనవరి 7న విడుదల కానున్న RRR మూవీని భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం అదిరిపోయే సంచలన రికార్డును నమోదు చేసుకుంది.

ఇండియాలోనే ఫస్ట్ మూవీ ఇదే
అమెరికాలో ఎక్కువ థియేటర్లలో విడుదలవుతోన్న ఏకైక సినిమాగా RRR రికార్డు క్రియేట్ చేసింది. ఇది అక్కడ తెలుగులో 1000, హిందీలో 793, తమిళంలో 291, మలయాళంలో 66, కన్నడంలో 62 ఇలా ఐదు భాషల్లో కలిపి 2212 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్‌లో రాలేదు. దీంతో మరో రికార్డు ఈ మూవీ సొంతమైంది.


Click it and Unblock the Notifications











