twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: భారీ ఖర్చుతో ఒకేసారి రెండు భారీ ఈవెంట్స్ ను ప్లాన్ చేసిన రాజమౌళి.. ఎక్కడంటే?

    |

    రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా RRR మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా చాలా బలంగా నమ్ముతున్నారు. ఇక RRR సినిమా కు సంబంధించిన మరో ప్రమోషన్ ఈవెంట్ ను కూడా స్టార్ట్ చేయాలి అని రాజమౌళి ప్రణాళికలు రచిస్తున్నాడు. ముఖ్యంగా రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కోసం కూడా ప్లాన్ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ వేడుకలు ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

    ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని..

    ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దని..

    నందమూరి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న RRR సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అసలైతే ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డేట్ ను మిస్ చేసుకోవద్దు అని చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు.

    రాధే శ్యామ్ వల్లనే.. ఆలస్యం..

    రాధే శ్యామ్ వల్లనే.. ఆలస్యం..

    అసలైతే ఈపాటికే మరొకసారి ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచాలి అని అనుకున్నారు. కానీ రాధే శ్యామ్ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆ సినిమా హడావిడిలో RRR సినిమా పోటీగా ఉండకూడదు అని ప్రమోషన్ స్టార్ట్ చేయలేదట. ప్రభాస్ కూడా ఈ విషయంలో రాజమౌళి నుంచి సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ విడుదలైన తర్వాతనే RRR సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచాలని రాజమౌళి కూడా ప్రభాస్ కు మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

    పవర్ఫుల్ గా సిద్దమవుతున్న హీరోలు

    పవర్ఫుల్ గా సిద్దమవుతున్న హీరోలు

    గతంలోనే చిత్ర యూనిట్ సభ్యులు కేవలం ప్రమోషన్స్ కోసమే దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా టాక్ అయితే వచ్చింది. ఇక మార్చి 25 వ తేదీన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు మరొకసారి అదే తరహాలో ప్రమోషన్స్ డోస్ పెంచాలి అని చూస్తున్నారు. ప్రస్తుతం వారి తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి తో కలిసి ప్రమోషన్స్ చేసేందుకు మరొకసారి పవర్ఫుల్ గా సిద్ధమయ్యారు.

    ముందుగా దుబాయ్ లో..

    ముందుగా దుబాయ్ లో..

    ఇక అన్ని భాషల వారిని ఆకట్టుకునే విధంగా భారీ ఖర్చుతో రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించాలని రాజమౌళి నిర్మాత డి.వి.వి.దానయ్య ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మొదట మార్చి 18వ తేదీన దుబాయ్ లో చాలా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలి అని అనుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా RRR ఈవెంట్ ఒక వేదిక కానున్నట్లు సమాచారం.

     మరో ఈవెంట్..

    మరో ఈవెంట్..

    ఇక మరొక ఈవెంట్ ను మార్చి 19వ తేదీన ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్ లోని చిక్ బల్లాపూర్ లో నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. దుబాయ్ ఈవెంట్ కు ఏపీ ఈవెంట్ కు ఒక రోజు గ్యాప్ మాత్రమే ఉంది. దుబాయ్ నుంచి రాగానే మరొక ఈవెంట్ ను వెంటనే స్టార్ట్ చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. మధ్యలో ఒక రోజు గ్యాప్ తీసుకొని చేసే అవకాశం కూడా ఉంది. మరి చిత్ర యూనిట్ ఆ ఈవెంట్స్ ను ఎలా హైలెట్ చేస్తుందో చూడాలి.

    English summary
    RRR movie two big pre release events plan ready,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X