అజయ్ దేవగన్‌కు సారీ చెప్పిన రాజమౌళి టీమ్.. అసలేం జరిగిందంటే..

దర్శక ధీరుడు SS Rajamouli దర్శకత్వంలో వస్తున్న RRR షూటింగ్ వాయిదాలతో ముందుకు సాగుతున్న.. ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం భారీ రేంజ్‌లో ఉన్నాయి. సినిమా రిలీజ్‌కు భారీ అంచనాలను క్రియేట్ చేయడంలో జక్కన టీమ్ తమ స్టయిల్‌ను కొనసాగిస్తున్నది. తాజాగా టైటిల్ మోషన్ పోస్టర్, రాంచరణ్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన స్పెషల్ వీడియోలు మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అజయ్ దేవగన్ విషయంలో చేసిన తప్పుకు రాజమౌళి టీమ్ సారీ చెప్పింది. ఇంతకు ఏమైందంటే..

Recommended Video

Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown
రాంచరణ్‌ కోసం స్పెషల్ వీడియో

రాంచరణ్‌ కోసం స్పెషల్ వీడియో

ఇటీవల బర్త్ డే జరుపుకొన్న రాంచరణ్‌కు ఎన్టీఆర్ చేతుల మీదుగా ఓ వీడియోను రిలీజ్ చేసి గ్రాండ్‌గా జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకొన్నారు. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో చెర్రీ బర్త్ డేను లో ప్రొఫైల్‌గా కానిచ్చేశారు. అయితే విడుదల చేసిన స్పెషల్ వీడియోకు మాత్రం భారీగా స్పందన వ్యక్తమైంది.

సాంకేతిక కారణాల వల్ల

సాంకేతిక కారణాల వల్ల

అదే విధంగా RRR చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్‌కు కూడా అలాంటి వీడియోను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారట. అయితే సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదని రాజమౌళి బృందం సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌తో వెల్లడించింది. పరిస్థితుల కారణంగా స్పెషల్ వీడియోను రిలీజ్ చేయలేకపోయాం. క్షమించాలి అంటూ RRR యూనిట్ ట్వీట్ చేశారు.

సహృదయం కలిగిన అజయ్ దేవగన్‌కు

సహృదయం కలిగిన అజయ్ దేవగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. సర్.. మా RRR మూవీలో భాగమైనందుకు మాకు గర్వంగా ఉంది. ఫస్ట్ షెడ్యూల్‌లో మీతో పనిచేసినందుకు గొప్పగా ఉంది. మీతో కలిసి పనిచేయడం గొప్ప మధురానుభూతి. మీకు కూడా అదే ఫీలింగ్ కలిగిందనుకొంటాను అని RRR యూనిట్ తమ సందేశంలో పేర్కొన్నది.

స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలనుకొన్నాం

మీ జన్మదినం రోజున మీకు మధురమైన అనుభూతిని పంచాలనుకొన్నాం. మీ ఫస్ట్ లుక్‌తో కూడిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేయాలని భావించాం. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్ల అది సాధ్యపడలేదు. మ్యూజిక్, డీఐ పనులు పెండింగ్‌లో పడటం వల్ల మేము సకాలంలో వీడియోను రిలీజ్ చేయలేకపోయాం. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ వీడియోకు సంబంధించిన అప్‌డేట్ ఇస్తాం అని RRR యూనిట్ తెలిపింది.

పలు భాషల్లో విలక్షణ నటులతో

పలు భాషల్లో విలక్షణ నటులతో

బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న RRR చిత్ర పలు భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ నటులతోపాటు ఆంగ్ల, తమిళ, కన్నడ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X