HCA Awards: హాలీవుడ్ అవార్డుల్లో RRR హవా.. ఏకంగా నాలుగింటిలో.. ఏకైక మూవీగా సంచలన రికార్డు
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి విశ్వవ్యాప్తం అయిపోయిందన్న విషయం తెలిసిందే. దీనికి కారణం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR (రౌద్రం రణం రుధిరం) మూవీనే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ముదులపడంతో పాటు ఇప్పటికే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా సొంతం చేసుకుంది. అలాగే, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు RRR మూవీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సాధించింది. ఆ పూర్తి సంగతులు మీకోసమే!

ఇద్దరు హీరోలతో జక్కన్న మ్యాజిక్
టాలీవుడ్ స్టార్లు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ క్రేజీ సినిమాలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రల్లో తమదైన రీతిలో అలరించారు.

ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్లింది
చాలా రోజుల పాటు థియేటర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా భారీ ప్రభావాన్ని చూపించిదని అందరికీ తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతూ అందరి దృష్టిలో పడింది.

ఆ అవార్డ్స్.. ఆస్కార్ నామినేషన్
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా.. వరల్డ్ వైడ్‌గా అదిరిపోయే రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా ప్రభావాన్ని చూపించి ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్ చాయిస్ సహా ప్రతిష్టాత్మక అవార్డులనూ దక్కించుకుంది. అంతేకాదు, ఆస్కార్‌కు సైతం నామినేట్ అయింది.

RRR ఖాతాలో మరిన్ని అవార్డ్స్
ఇప్పటికే చాలా అవార్డులను ఖాతాలో వేసుకున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ తాజాగా మరిన్ని వాటిని కూడా సొంతం చేసుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తాజాగా అవార్డులను ప్రకటించింది. ఇందులో RRR మూవీ ఏకంగా నాలుగు అవార్డులను అందుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.
ఆ నాలుగు విభాగాల్లోనే అవార్డ్స్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) ఇటీవలే నామినేషన్స్‌ను ప్రకటించింది. ఇందులో ఐదు విభాగాల్లో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ నామినేట్ అయింది. ఇక, తాజాగా కాలిఫోర్నియాలో జరుగుతోన్న కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రకటించారు. ఇందులో బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగాల్లో RRR అవార్డులు గెలిచింది.
మరో రెండు విభాగాల్లో కూడా
ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగానికి సంబంధించి ప్రతిష్టాత్మకమైనవిగా భావించే హాలీవుడ్ క్రిటిక్స్ అసోషియేషన్ (HCA Awards) అవార్డులు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో ఇప్పటికే నాలుగు విభాగాల్లో RRR మూవీ అవార్డులు గెలుచుకుంది. అలాగే, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లోనూ ఇది నామినేట్ అయింది. వాటిలో గెలుస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











