RRR ఫాన్స్ కి యూనిట్ షాక్.. ఈవెంట్ విషయంలో కీలక నిర్ణయం.. కేవలం వారికే!

దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ముంబైలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ విషయంలో షాక్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

ఆర్ ఆర్ ఆర్ పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలలో నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని కీలక పాత్రలలో నటిస్తుండగా హాలీవుడ్ నటీ ఒలివియా మోరిస్, బాలీవుడ్ నటి అలియా భట్ లు హీరోయిన్లుగా వ్యవరించారు.

జనవరి 7న

జనవరి 7న

ముందు దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా కరోనా సెకండ్ వేవ్ తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. సినిమా ప్రమోషన్ కోసం యూనిట్ కొత్తగా దేశవ్యాప్తంగా విడుదల చేయడానికి మల్టీప్లెక్స్ దిగ్గజం పివిఆర్ సినిమాస్‌తో చేతులు కలుపి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించింది.

 భారీ అంచనాలు

భారీ అంచనాలు

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మీద ముందు నుంచి భారీగానే అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్, టాలీవుడ్ లో రెండు కుటుంబాలకు చెందిన హీరోలు నటిస్తూ ఉండడం, స్టార్ నటీనటులు భాగం కావడమే కాక బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ కు చెందిన కొందరు నటీనటులు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

అసలు విషయం ఏమంటే ఈరోజు ముంబైలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ రానున్నార‌ట‌. ముంబైలోని ఫిల్మ్ సిటీలో 'ఆర్ఆర్ఆర్' వేడుక‌కు సిద్ధ‌మైన వేదిక, అక్క‌డ‌ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ దిగిన‌ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అలాగే, ముంబై విమానాశ్ర‌యంలో వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతున్నాయి.

అప్డేట్స్ కూడా బయటకు రాకుండా

అప్డేట్స్ కూడా బయటకు రాకుండా

ఈ ఈవెంట్‌లో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా పాల్గొననున్నారు. . బాలీవుడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా లెవెల్లో ఈ ఈవెంట్ ని మరింత స్పెషల్ గా ప్రజెంట్ చేయాలని రాజమౌళి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లు ఒకెత్తు RRR ఒకెత్తు అనేలా భారీ సెట్టింగులతో ఈవెంట్ ని ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ ఫాన్స్ కు షాక్ కలిగించే అంశం ఏంటంటే ఈ ఈవెంట్ ఓకే క్లోజ్డ్ ఈవెంట్.

ఎంపిక చేసిన 1500 మంది జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరు అవుతున్నారు అలాగే ఈ ఇంటికి సంబంధించిన ఎలాంటి లైవ్ అప్డేట్స్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. తాజా సమాచారం మేరకు ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ 31 వ తేదీన స్టార్ ప్లస్ టీవీలో ప్రసారం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X