Golden Globe Awards: RRR పెను సంచలనం.. నాటు నాటు సాంగ్‌కు అత్యుత్తమ అవార్డ్.. ఏషియాలోనే తొలిసారి

భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో.. ఇద్దరు బడా హీరోల కలయికలో రూపొందిన చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). తెలుగు సినిమా స్థాయిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. దీంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా RRR మూవీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఆ సంగతులు మీకోసం!

బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా RRR

బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా RRR


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). దీన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. పిరియాడిక్ జోనర్‌లో వచ్చిన దీనిలో చరణ్.. అల్లూరి, తారక్.. కొమరం భీం పాత్రలను పోషించారు.

ఓటీటీతో వరల్డ్ వైడ్‌గానే

ఓటీటీతో వరల్డ్ వైడ్‌గానే

RRR (రౌద్రం రణం రుధిరం) సినిమా చాలా రోజుల పాటు థియేటర్లలో భారీ ప్రభావాన్ని చూపించిదన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఓటీటీలోనూ ఈ మూవీ అదే దూకుడును ప్రదర్శించింది. ఫలితంగా స్ట్రీమింగ్ చేసిన జీ5, నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌లలో రికార్డు స్థాయిలో వ్యూస్ కూడా దక్కాయి. అంతేకాదు, ఈ చిత్రం ప్రపంచం దృష్టిని కూడా ఆకర్షించింది.

RRRకు ఎన్నో అవార్డులు

RRRకు ఎన్నో అవార్డులు

రిలీజ్‌కు ముందే అందరి దృష్టినీ ఆకర్షించిన RRR మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి ఎణ్నో అవార్డులకు నామినేట్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎన్నో కేటగిరీల్లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం అయ్యాయి.

ఆస్కార్ బరిలో ఆ సాంగ్

ఆస్కార్ బరిలో ఆ సాంగ్

2023 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా తాజాగా అకాడమీ పది విభాగాల్లో షార్ట్ లిస్టులను విడుదల చేసింది. ఇందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో పదిహేను పాటలను ఉంచింది. వాటిలో RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ కూడా చోటు దక్కించుకుంది. దీంతో సినీ ప్రియులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

గోల్డెన్ గ్లోబ్‌కు.. రెండింట్లో

గోల్డెన్ గ్లోబ్‌కు.. రెండింట్లో


ఆస్కార్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR (రౌద్రం రణం రుధిరం) బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగాల్లో నామినేట్ అయిన విషయం తెలిసిందే. దీనికోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఫ్యామిలీలతో అక్కడకు చేరారు.

నాటు నాటుకు అవార్డు

ఎంతో వైభవంగా జరుగుతోన్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని నాటు నాటు సాంగ్‌ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రకటించగానే ఆ సభా ప్రాగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఇక, ఏషియా ఖండం నుంచి ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి చిత్రంగా RRR సరికొత్త చరిత్రను సృష్టించింది.

అందుకున్న కీరవాణి

అందుకున్న కీరవాణి


80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని నాటు నాటు సాంగ్‌ ఎంపిక అవగానే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఆనందాన్ని పంచుకుంటూ కేకలు వేశారు. ఎంతో మంది అతిరథమహారథుల మధ్య ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఇక, ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ ఇవ్వగా రాహుల్ పాడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X