RRR Wins Oscar: ఆస్కార్‌‌లో తెలుగోడి సత్తా.. ఆవార్డుతో RRR చరిత్ర.. కార్తికేయదే అని చెప్పిన కీరవాణి

తెలుగు సినిమాను చిన్న చూపు చూసే పరిస్థితుల నుంచి.. ప్రపంచమే మన తెలుగు సినిమా వైపు చూసే రోజులను తీసుకొచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తెరకెక్కించిన చిత్రమే యాక్షన్ మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా సంచలన విజయాన్ని సాధించడంతో పాటు తెలుగు సినిమా స్టామినాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. ఇక, ఇప్పుడు ఏకంగా తెలుగు వాళ్లు గర్వంతో రొమ్ము విరిచి నిలబడేలా ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!

అంగరంగ వైభవంగా ఆస్కార్

అంగరంగ వైభవంగా ఆస్కార్

అంతర్జాతీయ స్థాయిలో సినీ రంగానికి అందించే అత్యుత్తమ అవార్డులు ఆస్కార్ 95వ వార్షికోత్సవ కార్యక్రమం లాస్ ఎంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. అంగరంగ వైభవంగా మొదలైన ఈ వేడుకలో తారల సందడి చేశారు. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన సినీ ప్రముఖులు విచ్చేశారు. దీంతో ఈ వేడుక మొత్తం తళుకుబెళుకులతో సాగిపోతోంది.

ఆస్కార్‌ బరిలో నాటు నాటు

ఆస్కార్‌ బరిలో నాటు నాటు

RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో 'నాటు నాటు' పాట ప్రపంచం మొత్తాన్ని ఓ రేంజ్‌లో ఊపేసింది. దీంతో ఇప్పటికే ఈ సాంగ్ ఎన్నో అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆస్కార్ అవార్డుకు కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. తద్వారా తెలుగు నుంచి నామినేట్ అయిన మొట్టమొదటి సాంగ్‌గా ఇది రికార్డును క్రియేట్ చేసింది.

నాటు నాటు పాటకు ఆస్కార్

నాటు నాటు పాటకు ఆస్కార్

ఎంతో వైభవంగా జరుగుతోన్న 95వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని నాటు నాటు సాంగ్‌ విజేతగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రకటించగానే ఆ సభా ప్రాగణమంతా చప్పట్లతో మారుమ్రోగింది. ఇక, దక్షిణాది నుంచి ఈ విభాగంలో అవార్డు అందుకున్న తొలి చిత్రంగా RRR సరికొత్త చరిత్రను సృష్టించింది.

వాళ్లిద్దరూ ట్రోఫీని తీసుకుని

95వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలోని నాటు నాటు సాంగ్‌ ఎంపిక అవగానే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, చంద్రబోస్‌తో పాటు పలువురు తమ ఆనందాన్ని పంచుకుంటూ కేకలు వేశారు. ఎంతో మంది అతిరథమహారథుల మధ్య ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌లు అందుకున్నారు.

హాలీవుడ్ రేంజ్‌లో పాట పాడి


అంగరంగ వైభవంగా సాగుతోన్న 95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పురస్కారాన్ని అందుకున్న తర్వాత ఎమ్ఎమ్ కీరవాణి హాలీవుడ్ స్టైల్‌లో పాటను పాడారు. ఈ అవార్డు రాజమౌళి వల్ల సాధ్యం అయిందని, ఇండియన్స్ అందరూ గర్వపడేలా RRR సాంగ్ చేసిందని ఆయన తన పాట ద్వారా ఆనందాన్ని పంచుకున్నారు.

కార్తికేయకు కీరవాణి థ్యాంక్స్

అంతర్జాతీయ వేదికపై అవార్డును స్వీకరించిన తర్వాత ఎమ్ఎమ్ కీరవాణి.. రాజమౌళి కుమారుడికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే 'థ్యాంక్యూ కార్తికేయ' అంటూ గట్టిగా అరుస్తూ చెప్పారు. దీనికి కారణం.. ఈ సాంగ్ కంపోజింగ్ వెనుక అతడు ఎంతో కష్టపడ్డాడని గతంలో కీరవాణి స్వయంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆస్కార్ వేదికపై కార్తికేయకు పేరు వెల్లడించారు.

శుభాకాంక్షలు... ట్రెండింగ్

95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవ కార్యక్రమంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా RRR మూవీలోని 'నాటు నాటు' సాంగ్ ఎంపిక కావడంతో తెలుగు వాళ్లంతా గర్వపడుతోన్నారు. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈ మూవీ పేరు ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X