RRR Trailer రికార్డుల బీభత్సం.. ఆ రూట్లో నెంబర్ వన్.. సౌత్ లో కూడా నెంబర్ వన్ దిశగా..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బాహుబలి సినిమా తర్వాత రాబోతున్న మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ RRR పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బాహుబలికి మించి ఉంటుంది అని దర్శకధీరుడు రాజమౌళి ట్రైలర్ తో మరోసారి రుజువు చేశాడు. రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ మొట్టమొదటి మల్టీ స్టారర్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న రికార్డులను చూస్తేనే అర్ధమవుతోంది.

 భారీ బడ్జెట్ తో..

భారీ బడ్జెట్ తో..

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించిన ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఈజీగా అర్ధమవుతోంది. నిర్మాత డివివి.దానయ్య ఈ సినిమాను 450కోట్ల భారీ బ్యాడ్జెట్ తో నిర్మించారు. సినిమాకి సంబంధించిన పనులన్నీ కూడా ఫినిష్ అయ్యాయి. ఇక సినిమా ట్రైలర్ అనుకున్నట్లుగానే సరికొత్త బజ్ క్రియేట్ చేసింది.

 ట్రైలర్ తోనే మరింత బజ్

ట్రైలర్ తోనే మరింత బజ్

దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా పరిస్థితులకు తగ్గట్టుగానే ప్రమోషన్ చేస్తూ ప్రమోషన్ చేస్తుంటారు. అయితే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రెండు రోజుల క్రితమే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు కొన్ని కారణాల వలన విడుదల చేయలేదు. ఇక ఫైనల్ గా నేడు విడుదల చేసి అంచనాల డోస్ ను మరింత పెంచేశారు.

టాలీవుడ్ లో నెంబర్ వన్ రికార్డ్

టాలీవుడ్ లో నెంబర్ వన్ రికార్డ్

అయితే ట్రైలర్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. టాలీవుడ్ లో అత్యధిక వేగంగా 1 మిలియన్ లైక్స్ అందుకున్న ట్రైలర్ గా RRR సరికొత్త రికార్డును అందుకుంది. అది కూడా 7 గంటల 43 నిమిషాల్లోనే ఆ రికార్డును అందుకోవడం విశేషం. ప్రస్తుతం మెగా నందమూరి అభిమానులు పోటాపోటీగా ట్రైలర్ ను మరింతగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

Recommended Video

RRR Trailer : Have You Observed This In The Trailer ? || Filmibeat Telugu
సౌత్ లో నెంబర్ 3

సౌత్ లో నెంబర్ 3

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా RRR నెంబర్ వన్ రికార్డును అందుకునేలా చేయాలని అభిమానులు టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో 24గంటల్లో అత్యదిక వేగంగా లైక్స్ అందుకున్న ట్రైలర్స్ లలో బిగిల్ 1.66 మిలియన్ లైక్స్ అందుకుంది. ఇక విశ్వాసం 1.16 మిలియన్ ఫాలోవర్స్ అందుకుంది. ఇక RRR 8 గంటల్లో 1.1 మిలియన్ లైక్స్ ను దక్కించుకుంది. వకీల్ సాబ్ 1.006 మిలియన్ లైక్స్ అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X