twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: ఎక్కడా తగ్గని క్రేజ్.. ఏకైక ఇండియన్ సినిమాగా రాజమౌళికి అలాంటి ఘనత

    |

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRR (రౌద్రం రణం రుధిరం) పేరుతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా అనేక వాయిదాల తర్వాత మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆ వివరాలు

    సూపర్ హిట్ టాక్

    సూపర్ హిట్ టాక్


    డీవీవీ దానయ్య నిర్మాణంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలోరామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన ఒలీవియా మోరిస్ నటించారు. అజయ్ దేవగన్ ప్రత్యేక పాత్రలో కనిపించగా శ్రియ శరణ్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

    ఒకేసారి

    ఒకేసారి


    విడుదలైన అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో తెలుగు సినిమా సత్తా చాటింది. ఇక "ఆర్ఆర్ఆర్"హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడంతో ఈ సినిమా ఇప్పుడు విదేశీ ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. ఈ సినిమా బాగుందని ఇప్పటికే పలువురు హాలీవుడ్ సెలబ్రిటీ లు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే. ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది.

     30 కి పైగా దేశాలలో

    30 కి పైగా దేశాలలో


    ఇప్పటికే ఓటీటీలో విడుదలైనా ఈ సినిమా స్పెషల్ షోలు ఇంకా యూఎస్, యూకే లాంటి దేశాల్లో రన్ అవుతున్నాయి అంటే సినిమాకు క్రేజ్ ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. తాజాగా "ఆర్ఆర్ఆర్ " మూవీని ప్రపంచవ్యాప్తంగా మరో 30 కి పైగా దేశాలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

    టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా

    టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా


    ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో ఒకటిగా "ఆర్ ఆర్ ఆర్ " మూవీ నామినేట్ కావడం విశేషం. టాప్ టెన్ బెస్ట్ ఫిల్మ్స్ లో "ఆర్ ఆర్ ఆర్ "మూవీ తప్ప మిగతా అన్ని చిత్రాలు కూడా హాలీవుడ్ నుంచి ఉన్నాయి. ఆ పది సినిమాల లిస్టులో ఫస్ట్ టైమ్ ఎంపిక కాబడిన ఇండియన్ మూవీగా "ఆర్ ఆర్ ఆర్ "నిలిచింది.

    మంచి స్పందన

    మంచి స్పందన


    ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ స్ట్రీమింగ్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో అవుతోంది. ఇక కొరియాలో కూడా ఈ సినిమాను కొరియన్ సబ్ టైటిల్స్ తో విడుదల చేశారు మేకర్స్. అక్కడ కూడా ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంటోంది.

    English summary
    for the First time an Indian Movie is up for nomination at Hollywood critics association, rrr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X