ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరో న్యూస్: రాజమౌళి చేసిన పని వల్లే.. ఆ ఫొటోతో అనుమానాలు మొదలు
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పేరును నందమూరి తారక రామారావు మనవడే అయినా.. వారసత్వం కంటే ముందుగా తన టాలెంట్‌తోనే గుర్తింపును అందుకున్నాడు. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్, సింగింగ్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటి టీనేజ్‌లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక, ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరో న్యూస్ వైరల్ అవుతోంది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

వరుసగా ఐదు విజయాలతో ఎన్టీఆర్ హవా
ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'టెంపర్' అనే మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి విజయాలను అందుకున్నాడు. తద్వారా తన హవాను చూపిస్తున్నాడు.

టాలీవుడ్ హిస్టరీలోనే బిగ్ ప్రాజెక్టులో తారక్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న ఈ మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరిగా నటిస్తున్నారు.

ఒకరితో ప్రకటించి.. మరొకరిని తీసుకొచ్చాడు
RRR మూవీ షూటింగ్ జరుగుతోన్న సమయంలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇది రేపో మాపో ప్రారంభం అవుతుందని అంతా అనుకుంటోన్న సమయంలో భారీ షాకిచ్చాడు యంగ్ టైగర్. ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేసి బడా డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇది త్వరలోనే పట్టాలెక్కబోతుందని చెప్పారు.

బుల్లితెరపైకి రీఎంట్రీ.. కోటీశ్వరులను చేసేలా
వెండితెరపై ఎనలేని క్రేజ్‌ను అందుకుని స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో కొన్నేళ్ల క్రితం బిగ్ బాస్ షో ద్వారా బుల్లితెరపైకి హోస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. అందులో కేవలం ఒక్క సీజన్ మాత్రమే చేసి తర్వాత తప్పుకున్నాడు. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే షోతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇది త్వరలోనే ప్రారంభం కాబోతుంది.

కెరీర్ పరంగా ఫామ్‌లో.. పొలిటికల్ కెరీర్‌పై
కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి సమయంలో అతడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో 'ఇప్పుడు సమయం.. సందర్భం కాదు. ఓ రోజు కాఫీ తాగుతూ మనమే కబుర్లు చెప్పుకుందాం' అని చెప్పాడు.

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరో న్యూస్
తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు ఆ పార్టీ పగ్గాలు స్వీకరించబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఉగాదికి విడుదలైన పోస్టరే కావడం విశేషం.
Recommended Video

రాజమౌళి వల్లే.. ఆ ఫొటోతో అనుమానాలు
ఉగాది పండుగను పురస్కరించుకుని RRR నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసున్న ఓ ఫొటోను విడుదల చేశాడు రాజమౌళి. అందులో తారక్ తలకు పసుపు రంగు రిబ్బన్ కట్టుకుని కనిపించాడు. దీంతో అతడు పొలిటికల్ ఎంట్రీని పరోక్షంగా వెల్లడించాడని చెబుతూ.. నందమూరి ఫ్యాన్ పేజీలలో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో వీటికి మద్దతుగా ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











