ఇండస్ట్రీని షేక్ చేస్తున్న RRR బిజినెస్.. రికార్డు ధరకు దిల్ రాజు, కొర్రపాటి సాయికి హక్కులు
బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొన్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌తో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్, రానా కాంబినేషన్‌లో రికార్డులు తిరగరాసిన జక్కన.. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో RRR మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి 2021 బరిలో దూకిన RRR చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ చేయడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. పలు ఏరియాల్లో RRR మూవీ చిత్రం చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం, సీడెడ్ హక్కులు
RRR చిత్రం రిలీజ్‌కు ఏడాదికి ముందే భారీ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ బిజినెస్ ముగించింది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొన్నారు. దాదాపు రూ.75 కోట్లు చెల్లించి ఈ సినిమా హక్కులను దక్కించుకొన్నట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇక నిర్మాత కొర్రపాటి సాయి రూ.36 కోట్లు చెల్లించి సీడెడ్ హక్కులను పొందారనే విషయం చర్చనీయాంశమైంది.

ఆంధ్రాలో ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఆంధ్రాలోని ప్రధాన సెంటర్లను కూడా నిర్మాత, డిస్టిబ్యూటర్ కొర్రపాటి సాయి సొంతం చేసుకొన్నారు వైజాగ్, బళ్లారి హక్కులను రూ.24 కోట్లకు సొంతం చేసుకోవడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా హక్కులను డిస్టిబ్యూటర్లు భరత్, రాజులు రూ.18 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లా హక్కులను ప్రవీణ్, బన్నీ రూ.14 కోట్లకు దక్కించుకొన్నారు.

కృష్ణా, గుంటూరు జిల్లాలో
కృష్ణా జిల్లా హక్కులు రికార్డు స్థాయి ధరకు అమ్ముడు పోయాయనే విషయం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రముఖ నిర్మాత, మైత్రీ మూవీస్ అధినేత నవీన్ రూ.15 కోట్లకు, గుంటూరు హక్కులను యూవీ క్రియేషన్స్ రూ.18 కోట్లు చెల్లించి తీసుకొన్నట్టు తెలిసింది. అలాగే నెల్లూరు థియేట్రికల్ హక్కుల కూడా యూవీ వంశీ రూ.9 కోట్లకు సొంతం చేసుకొన్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఓవరాల్ ఏపీ, తెలంగాణ బిజినెస్
బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాకు భారీగా క్రేజ్ ఉండటం, అలాగే ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా RRR ప్రి రిలీజ్ జరగడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దాదాపు ఏపీ, తెలంగాణ బిజినెస్ మొత్తం రూ.209 కోట్ల వద్ద ముగిసినట్టు సమాచారం. ఇక మిగితా ఏరియాల హక్కులకు కూడా భారీగా డిమాండ్ ఉన్నట్టు సమాచారం.

సంక్రాంతి బరిలో RRR
అయితే RRR మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. తొలుత జూలై 30న విడుదల తేదీని ప్రకటించారు. ఆ తర్వాత దసరా బరిలో దూకుదామని ప్లాన్ చేశారు. చివరకు సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్ణయించి జనవరి 8, 2021కి రిలీజ్ చేస్తున్నట్టు డేట్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications











