RRR: చిరంజీవికి ఇష్టం లేకున్నా ఇండస్ట్రీ పెద్ద ఆయనే.. తారక్‌కు తెలుసు చరణ్‌కు తెలీదంటూ జక్కన్న ఓపెన్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియాలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ చిత్రాన్ని దేశమే మెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో తెరకెక్కించడమే. అంతేకాదు, ఇది ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీగా రూపొందింది. దీంతో ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇందులో అసలు ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్‌ను తీసుకోవడంతో పాటు మెగాస్టార్ చిరంజీవిపై రాజమౌళి కామెంట్స్ చేశారు. అసలేం మాట్లాడారో మీరూ చూడండి!

రియల్ హీరోలుగా టాలీవుడ్ స్టార్లు
తెలుగు గడ్డపై పోరాడిన విప్లవ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిన మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికికి కీరవాణి సంగీతం ఇచ్చారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు.

రిలీజ్‌కు రెడీగా.. రీసౌండ్ వచ్చేలా
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో భారీగా రాబోతున్న RRR (రౌద్రం రణం రుధిరం) మూవీని మార్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్ల బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అంతేకాదు, చాలా చోట్ల అప్పుడే టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఇలా కొద్ది రోజులుగా ప్రతి విషయంలోనూ ఈ సినిమా పేరు రీసౌండ్ వస్తోంది.

గ్రాండ్‌గా RRR ప్రీ రిలీజ్ ఈవెంట్
RRR (రౌద్రం రణం రుధిరం) విడుదలకు సమయం దగ్గర పడడంతో కర్నాటకలోని చిక్ బల్లాపూర్‌లో శనివారం సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు కొన్ని వేల మంది ఫ్యాన్స్ హాజరయ్యారు. దీనికి ముఖ్య అతిథిగా కర్నాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, శివరాజ్‌కుమార్ విచ్చేశారు. వీళ్లతో పాటు పలువురు ప్రముఖులూ వచ్చారు.

రెండు రాష్ట్రాల సీఎంలకు థ్యాంక్స్
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. 'టికెట్ రేట్ల పెంపు విషయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి రిక్వెస్ట్ చేశాము. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు. ఆయనకు ధన్యవాదాలు. అలాగే, సీఎం జగన్ కూడా మా బాధను అర్థం చేసుకుని టికెట్ రేట్లు పెంచుకునే వెసలుబాటును కల్పించారు. ఆయనకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా' అన్నారు.

చిరంజీవిపై రాజమౌళి ప్రశంసలు
ఈ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవిపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. 'టికెట్ రేట్ల జీవో బాలేదని అనిపించింది. మేం ముందుకు వెళ్దామని అనుకున్నాం. కానీ కుదరలేదు. అప్పుడు ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. సీఎం గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని వాడుకుని ఈ కొత్త జీవో కోసం ప్రయత్నించారు. రేట్లు పెంచడానికి కారణమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు' అని చెప్పారు.
డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ
https://telugu.filmibeat.com/heroine/naagin-fame-mouni-roy-beach-photo-gone-viral-108046.html

నెగ్గాలని తగ్గాడు.. ఇండస్ట్రీ పెద్దగా
ఇదే వేదికపై జక్కన్న మాట్లాడుతూ.. 'చిరంజీవి గారిని చాలా మంది చాలా అన్నారు. కానీ, మమ్మల్ని నెగ్గించేందుకు ఆయన తగ్గారు. చాలా మాటలు పడ్డారు. తెలంగాణ జీవో రావడానికి కూడా ఆయనే కారణం. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం ఆయనకిష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే చూడాలని అంటారు. కానీ, నేను మాత్రం చిరు గారిని పెద్దే అంటాను' అని స్పష్టం చేసేశారు.

చరణ్‌కు ఆ విషయం తెలియదు
చరణ్ గురించి మాట్లాడుతూ.. 'చిరంజీవి గారు రామ్ చరణ్ తేజ్ అని ఎందుకు పెట్టారో తెలీదు కానీ.. అతడు హనుమంతుడిలాంటోడు. అతడికి తన బలం గురించి తెలీదు. ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు.. వాళ్లు ఏం చేస్తారో తెలీదు. ఆంజనేయుడికి తన బలం ఏంటో చెబితే.. సముద్రాన్ని దాటేశాడు. అలాంటి ఆంజనేయుడు నా బ్రదర్' అని చెప్పుకొచ్చారు రాజమౌళి.

ఎన్టీఆర్‌కు మాత్రం అది తెలుసు
తారక్ గురించి వివరిస్తూ 'హరికృష్ణ గారు తారక రామారావు అని ఎందుకు పేరు పెట్టారో గానీ.. సేమ్ రాముడిలా.. పితృవ్యాఖ్యపరిపాలకుడు.. ఏక పత్నివ్రతుడు. తన బలం ఏంటో తెలిసిన నటుడు ఎన్టీఆర్. ఎలా చేయగలడో.. ఎంతలా మెప్పించగలడో.. తెలుసు.. అలాంటి నా భీముడు. మొత్తంగా చరణ్‌కు బలం తెలీదు.. తారక్‌కు తెలుసు' అంటూ పేర్కొన్నారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











