చరణ్, తారక్‌ను కలపడంపై పెదవి విప్పిన రాజమౌళి.. మూవీలో ఇద్దరి రోల్స్.. ఫ్యాన్స్ గొడవలపై షాకింగ్‌గా!

దాదాపు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో RRR (రౌద్రం రణం రుధిరం) ఒకటి. దీనికి కారణం ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో తీస్తుండడమే. అంతేకాదు, ఇది టాలీవుడ్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ చిత్రం అనుకున్నప్పటి నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఇందులో అసలు ఈ సినిమా కోసం ఎన్టీఆర్, చరణ్‌ను తీసుకోవడంపై రాజమౌళి స్పందించారు. అంతేకాదు, మూవీలో ఇద్దరి రోల్స్.. ఫ్యాన్స్ గొడవల గురించి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం!

విప్లవ వీరులుగా మారిన స్టార్ హీరోలు

విప్లవ వీరులుగా మారిన స్టార్ హీరోలు

తెలుగు గడ్డపై పుట్టిన విప్లవ హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి రూపొందిస్తోన్న మూవీనే RRR (రౌద్రం రణం రుధిరం). భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఈ సినిమాలో తారక్.. కొమరం భీం, చరణ్.. అల్లూరి పాత్రలను చేస్తున్నారు.

అదిరిన ట్రైలర్... రికార్డులు నమోదు

అదిరిన ట్రైలర్... రికార్డులు నమోదు

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన RRR మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోల ఎలివేషన్స్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషన్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. అందుకే దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. దీంతో నేషనల్ వైడ్‌గా RRR పేరు మారుమ్రోగుతోంది.

అక్కడ కంప్లీట్.. ఇప్పుడు తెలుగులో

అక్కడ కంప్లీట్.. ఇప్పుడు తెలుగులో

RRR మూవీని జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అప్పుడే ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేసింది. ఇప్పటికే ముంబై, చెన్నై, బెంగళూరులో ప్రెస్‌మీట్లు నిర్వహించిన RRR యూనిట్.. ఇప్పుడు హైదరాబాద్‌లో చిట్ చాట్ చేసింది. దీనికి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, దానయ్య, ఆలియా భట్‌లు హాజరై ఎన్నో విషయాలు పంచుకున్నారు.

చరణ్‌.. తారక్ పాత్రల గురించి ప్రశ్న

చరణ్‌.. తారక్ పాత్రల గురించి ప్రశ్న

తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు RRR మూవీ యూనిట్ సమాధానాలు చెప్పింది. ఈ సందర్భంగా కొందరు రిపోర్టర్లు.. అసలు ఈ సినిమాకు ఎన్టీఆర్, చరణ్‌నే ఎందుకు తీసుకున్నారు?.. ఇద్దరిలో ఎవరి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది? ఫ్యాన్స్‌తో గొడవలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వంటి క్వశ్చన్లు అడిగారు.

తారక్, చరణ్‌ను కలపడంపై జక్కన్న

తారక్, చరణ్‌ను కలపడంపై జక్కన్న

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు రాజమౌళి సరైన సమాధానాలు ఇచ్చారు. ఇద్దరు హీరోలను కలపడం గురించి మాట్లాడుతూ.. 'ఒకసారి చరణ్‌ను ఇంటికి రమ్మన్నాను. అప్పటికే అక్కడ తారక్ ఉన్నాడని ఆయనకు తెలీదు. ఆ తర్వాత ఇద్దరితో సినిమా చేద్దామనకున్నట్లు చెప్పి.. లైన్లు వినిపించాను. దీనికి ఇద్దరూ ఒప్పుకున్నారు' అని చెప్పుకొచ్చారు.

ఎవరి పాత్ర ఎలా ఉండబోతుందంటే

ఎవరి పాత్ర ఎలా ఉండబోతుందంటే

ఇక, RRR మూవీలో ఎవరి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్న దానిపై స్పందిస్తూ.. 'నేను యంగ్ టైగర్, మెగా పవర్ స్టార్‌ను తీసుకున్నాను. కానీ, సినిమాలో ఎన్టీఆర్, చరణ్ మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసే వాళ్లు వాళ్ల పాత్రలపైనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎవరు ఎన్ని గుద్దులు గుద్దారు అనేది పట్టించుకోరు. అలా సినిమానే నడిపిస్తుంది' అంటూ వివరించారు రాజమౌళి.

ఫ్యాన్స్ గొడవలపై రాజమౌళి క్లారిటీ

ఫ్యాన్స్ గొడవలపై రాజమౌళి క్లారిటీ

పాత్రల ప్రాధాన్యంలో తేడా ఉంటే ఫ్యాన్స్ గొడవ చేస్తారన్న దానిపై జక్కన్న మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో ఎవరి పాత్ర ఎంత ఉంటుంది అనే దానికంటే.. ఇద్దరూ కలిసి ఎంత ప్రభావం చూపించారు అనేది మెయిన్. అందుకే ఈ సినిమాకు ముందు ఏమైనా డౌట్లు ఉన్నా.. చూసిన తర్వాత ఫ్యాన్స్ అలా ఫీల్ అవరు. దీనివల్ల మరిన్ని మల్టీస్టారర్లు కూడా వస్తాయి' అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X