twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కోపం నశాలానికి ఎక్కిన మూమెంట్, అణుచుకుని హుందాగా...

    |

    'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రెస్ మీట్ గ్రాండ్‌గా జరింది. ఈ సినిమాపై నెలకొన్న అనుమానాలను, సందేహాలను రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మీడియా వారు అడిగిన కొన్ని ప్రశ్నలు 'ఆర్ఆర్ఆర్' టీంను ఆశ్చర్యానికి గురి చేయగా, మరికొన్ని కడుపుబ్బా నవ్వించాయి. అయితే ఒకే ఒక ప్రశ్న మాత్రం వారిని ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది.

    ఆ ప్రశ్న తాలూకు ఆగ్రహం రాజమౌళి, రామ్ చరణ్‌లో అంతగా కనిపించక పోయి.... ఎన్టీఆర్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయారు. హుందాగా స్పందిస్తూనే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తారక్ ఆగ్రహానికి గురికావడానికి కారణం ఏమిటో ఓ లుక్కేద్దాం.

    ఇంతకీ ఏమిటా ప్రశ్న? అందులో ఏ ముంది?

    ఇంతకీ ఏమిటా ప్రశ్న? అందులో ఏ ముంది?

    కొమురం భీం ముస్లిం పాలనలో ఉండేవారు.. అల్లూరి సీతా రామరాజు క్రిస్టియన్స్ అయిన బ్రిటిషర్స్ పాలనలో ఉండేవారు. ఈ ఇద్దరూ కూడా బయటి నుంచి వచ్చిన వారే.. వీరేమో హిందువులు. మీరు స్టోరీ అనుకున్నపుడు అలాంటి ఆలోచన మీకు ఉండక పోవచ్చు. కానీ రేపు సినిమా ప్రజల్లోకి వచ్చినపుడు ఎవరైనా దీన్ని ఆ కోణంలో చూసి వివాదం చేస్తే? పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్న ఎదురైంది.

    కూల్‌గా రియాక్ట్ అయిన రాజమౌళి

    కూల్‌గా రియాక్ట్ అయిన రాజమౌళి

    ఏం అడుగుతున్నారు సార్... ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింక్ వేయవచ్చా? సరే మీరు చెప్పినట్లే వివాదం వచ్చిందే అనుకోండి... వివాదం ఉందని సినిమా తీయడం మానేయాలా? ఇలాంటివి వస్తూనే ఉంటాయి. నేనైతే ఇలాంటి వాటి గురించి ఆలోచించను... అంటూ రాజమౌళి కూల్‌గా రియాక్ట్ అయ్యారు.

    కోపాన్ని అణుచుకుని ఎన్టీఆర్ హుందాగా..

    కోపాన్ని అణుచుకుని ఎన్టీఆర్ హుందాగా..

    అయితే ఈ ప్రశ్న ఎన్టీఆర్‌కు చాలా కోపం తెప్పించినట్లు ఆయన ఫేర్ రియక్షన్స్ స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి కానీ వారికి లేవు.. మన ఆలోచనలు వారిపై రుద్దేస్తున్నాం'' అంటూ హుందాగా స్పందించారు.

    కులం, మతం అంటే తారక్‌కు చిరాకు..

    కులం, మతం అంటే తారక్‌కు చిరాకు..

    కులం, మతం లాంటి తేడాలతో మనుషులను, పరిస్థితులను, సినిమాలను బేరీజు వేస్తే ఎన్టీఆర్ చాలా చిరాకు పడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. అందుకే ఆ ప్రెస్ మీట్లో ఆ ప్రశ్న ఎదురవ్వగానే ఎన్టీఆర్ కోపం అనే తన ఎమోషన్ ఆపుకోలేక పోయారు.

    English summary
    RRR is an upcoming Telugu Historical fiction film scripted and directed by S. S. Rajamouli. It stars N. T. Rama Rao Jr., Ram Charan, Alia Bhatt and Ajay Devgn. RRR is a pure fiction that has been drafted on the idea of Alluri and Komuram Bheem meeting each other in Delhi and later becoming friends during their away time. Set in 1920s, the film will have a British regime including then culture and lifestyle. It is a pan Indian story painted on a large canvas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X