RR Vs RRR: తొక్క తీస్తా.. రాజస్థాన్ రాయల్స్‌కు డీవీవీ దానయ్య స్ట్రాంగ్ వార్నింగ్!

ప్రేక్షకులకు అధికంగా ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేవి రెండే రెండు. ఒకటి సినిమా అయితే మరొకటి క్రికెట్. ఇక ఐపీఎల్ వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు. అయితే ఐపీఎల్ సీజన్ లో కోల్డ్ వార్స్ జరగడం పరిపాటే. అది మైదానం వరకు ఉంటే పర్వాలేదు. కానీ హద్దులు దాటితే దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది. ఇందుకు తాజాగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ RRR మూవీపై చేసిన ట్వీటే ఉదాహరణ. అసలు ఏమైంది? ఏంటా విషయం? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ మూవీ RRR (రౌద్రం రణం రుధిరం) తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు దాటి గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్, హెచ్సీఏ అవార్డులతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారాన్ని సాధించి యావత్ భారతదేశం గర్వపడేలా చేసింది. అలాంటి సినిమాపై RRR కంటే SSS గ్రేట్ అనే ట్వీట్ దుమారం రేపింది.

RRR Producer Danayya Strong Warning To Rajasthan Royals IPL Team

మే 7వ తేదిన సన్ రైజర్స్ (Sunrisers Hyderabad) వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఈ మ్యా చ్ సమయంలో రాజస్థాన్ టీమ్ తమ కెప్టెన్ సంజు శాంసన్ (Sanju Samson)ని పొగుడతూ RRR కంటే (SSS Skipper Sanju Samson) బ్యాటింగ్ గొప్పది అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ మ్యాచ్ లో చివరిగా హైదరాబాద్ టీమ్ పై రాజస్థాన్ ఓడిపోయింది.

రాజస్థాన్ టీమ్ చేసిన ట్వీట్ కు నిర్మాత డీవీవీ దానయ్య రియాక్ట్ అయ్యారు. రవితేజ ఇడియట్ మూవీలో పోలీస్ స్టేషన్ లోని కామెడీ సన్నివేశాన్ని షేర్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. ఆ సీన్ లో "తొక్క తీస్తా, ఫ్యాన్సు.. బిల్డప్పు" అనే డైలాగ్ ఉంటుంది. ఇలా డైలాగ్ తో రాజస్థాన్ టీమ్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది దానయ్య ఎంటర్టైన్ మెంట్స్. దీంతో ఈ ట్వీట్ వైరల్ కాగా "మీ నుంచి ఇది ఊహించలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక దానయ్య చేసిన ట్వీట్ వైరల్ కావడం, రాజస్థాన్ టీమ్ పై విమర్శలు తలెత్తడంతో క్రికెట్ టీమ్ స్పందించింది. "ఈ మూవీ ప్రపంచాన్ని మెప్పించింది. క్షమాపణలు తెలియజేస్తున్నాం" అని మరో ట్వీట్ లో రాసుకొచ్చింది. దీనికి RRR మూవీకి చెందిన అకౌంట్ నుంచి వెంకీ సినిమాలో రవితేజను బ్రహ్మానందం కొట్టిన GIFతో రిప్లై వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X