బ్యాడ్ నేమ్ రావొద్దనే.. మీడియా ముందుకు రాజమౌళి.. హీరోయిన్ వ్యవహారమే కారణమా?
Recommended Video

బాహుబలి తర్వాత దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టు గురించి ఎలాంటి న్యూస్ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్రం బృందం. దీంతో ఈ సినిమాపై రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఇవన్నీ సర్వసాధారణమే అయినా... ఇటీవల వచ్చిన కొన్ని రూమర్స్ ఇటు రాజమౌళితో పాటు అటు ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు మచ్చ తెచ్చే విధంగా ఉండటంతో జక్కన్న అలర్ట్ అయ్యారు.

మీడియాకు ముందుకు రాబోతున్న రాజమౌళి
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 14న రాజమౌళి మీడియా ముందుకు రాబోతున్నారని, సినిమాపై వస్తున్న రూమర్స్ మీద వివరణ ఇవ్వడంతో పాటు మరిన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ వ్యవహారమే కారణమా?
రాజమౌళి మీడియా ముందుకు రావడానికి ఈ సినిమా హీరోయిన్ ఎంపిక విషయంలో మీడియాలో జరిగిన రచ్చే. జాతీయ మీడియాలో సైతం ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అలియా భట్ కోసం రాజమౌళి చాలా ప్రయత్నాలు చేశారని, అయితే ఆమె అతడి ఆఫర్ తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది.

ఆ రూమర్ మరింత బాధించిందా?
గతంలో అలియా భట్‌ను సంప్రదించగా.... నా డేట్స్ ఖాళీ లేవని ఆమె స్పష్టం చేసింది. అయినా రాజమౌళి మరోసారి తన టీంను పంపి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తాం అంటూ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. దీనికి అలియా నేను డబ్బు మనిషిని కాదంటూ రిప్లై పంపినట్లు గాసిప్స్ గుప్పుమన్నాయి. ఈ రూమర్స్ రాజమౌళిని మరింత బాధించాయట.

ప్రెస్ మీట్లో స్టోరీ లైన్ చెప్పబోతున్నారా?
ఇక ‘ఆర్ఆర్ఆర్' సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటి? ఎలాంటి కథతో సినిమా రాబోతోంది అనే విషయంలో కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా రాజమౌళి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. గతంలో ఈగ, బాహుబలి సినిమా సమయంలో రిలీజ్ ముందే కథకు సంబంధించిన వివరాలు ఆయన వెల్లడించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











