RRR రీ రిలీజ్ రచ్చ.. వేలాది మంది క్యూ కట్టిన అమెరికా ప్రేక్షకులు.. వీడియో వైరల్..
RRR రిలీజై ఏడాది పూర్తి కావొస్తున్నా ఇంకా రాజమౌళి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తగ్గలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అవార్డుల పంట పండిస్తున్నది. ఈ సినిమా ఆస్కార్ రేసులో కూడా ముందుకు సాగుతున్నది. ఈ సినిమా రిలీజై 342వ రోజు కావొస్తున్న నేపథ్యంలో అమెరికాలో భారీ ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. అయితే ఈ సినిమా కోసం అమెరికావాసులు భారీగా క్యూ కట్టడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..
RRR సినిమాను అమెరికాలోని లాస్ ఎంజెలెస్ డౌన్ టౌన్‌లోని ఏస్ హోటల్లోని అతిపెద్ద థియేటర్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. ఈ థియేటర్‌లో 1647 సీట్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ సినిమాను చూసేందుకు థియేటర్ వద్ద భారీగా క్యూ కట్టడం చర్చనీయాంశమైంది. వేలాది మంది క్యూకట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇన్స్‌టాగ్రామ్‌లో RRR అఫిషియల్ పేజ్ ఓ వీడియోను పోస్టు చేసింది. 1647 సీట్లున్న థియేటర్‌లో టికెట్లు అమ్ముడయ్యాయి. అమెరికాలో 342 రోజు ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా కోసం వేలాది మంది క్యూ కట్టి సినిమాను చూసేందుకు సిద్దమయ్యారు. ఈ సినిమా క్రేజ్ ఇప్పటికే మాములుగా లేదు అని మెసేజ్ పెట్టారు. భారీ క్యూలో నిలుచొన్న ప్రతీ ఒక్కరికి మా స్వాగతం అంటూ కామెంట్ పెట్టారు.
RRR చిత్ర మార్చి 12 జరగబోయే ఆస్కార్ అవార్డుల కోసం సిద్దమవుతున్నది. ఈ వేడుకలో రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ప్రోమోషన్స్ కోసం రాంచరణ్, రాజమౌళి, చిత్ర యూనిట్ అమెరికాలో మకాం వేశారు.


Click it and Unblock the Notifications











