twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR release postpone నిర్మాతపై భారీ దెబ్బ.. ఎస్ఎస్ రాజమౌళి టీమ్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR చిత్రం రిలీజ్ వాయిదా పడటంతో ఇండస్ట్రీ వర్గాలనే కాకుండా ప్రేక్షకులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. పలు దేశాలతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్, కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో RRR సినిమా రిలీజ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో కారణంగా ఏ మేరకు నష్టం వాటిల్లిందంటే..

    పలుమార్లు షూటింగ్ వాయిదా

    పలుమార్లు షూటింగ్ వాయిదా


    పరభాష నటులు, అత్యున్నత సాంకేతికతతో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన RRR సినిమాకు ఆది నుంచి వాయిదాల కష్టాలు వెంటాడుతున్నాయి. షూటింగు దశలో స్టార్ హీరోలు గాయాలపాలు కావడం ఒక కారణమైతే.. కరోనావైరస్ మరో కారణంగా మారింది. అలాంటి అవస్థలను దాటుకొని రిలీజ్ సిద్దమైన తరుణంలో ఒమిక్రాన్ భూతం సినిమా రిలీజ్‌కు అడ్డుగా నిలిచింది.

    ఐదుసార్లు రిలీజ్ నిలిపివేత

    ఐదుసార్లు రిలీజ్ నిలిపివేత

    RRR సినిమా విషయానికి వస్తే దాదాపు ఐదుసార్లు రిలీజ్‌ను వాయిదా వేశారు. దాంతో సినిమాకు సంబంధించిన నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. కరోనావైరస్ కారణంగా షూటింగులు వాయిదా పడటంతో సెట్స్ నిర్మాణం, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల డేట్స్ అడ్జస్ట్‌మెంట్ తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి సమస్యలను అధిగమించి RRRను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

    దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్

    దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్


    RRR ప్యాన్ ఇండియా సినిమా కావడంతో భారీగా ప్రమోషన్స్‌కు ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో నటించిన ఎన్టీఆర్, రాంచరణ్‌కు దేశవ్యాప్తంగా మోస్తారు పాపులారిటి ఉన్నప్పటికీ.. దానిని రెట్టింపు చేసుందుకు ముంబై, చెన్నై లాంటి ప్రదేశాల్లో భారీగా ఈవెంట్స్ నిర్వహించారు. నేషనల్ ఛానెల్స్‌లో టాప్ షోలో రాజమౌళితోపాటు స్టార్ హీరోలందరూ ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. అందుకు భారీగానే నిర్మాత దానయ్య ఖర్చు చేశారు.

    ఫ్యాన్స్‌ను భారీగా తరలింపు

    ఫ్యాన్స్‌ను భారీగా తరలింపు

    దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్ భారీగా తరలివెళ్లారు. ప్రమోషన్ ఈవెంట్‌లో అగ్ర నటులకు జోష్ కలిగించేందుకు అభిమానులకు రకరకాల ఏర్పాట్లు చేశారు. బస్సులు, రైళ్లలో ప్రమోషన్ ఈవెంట్స్‌కు తరలి రావడంతో నిర్మాత వారి కోసం భారీగానే ఖర్చు చేశారు. అయితే ఇలాంటి ఏర్పాట్లతో సినిమా రిలీజ్‌కు ముందు మంచి రెస్సాన్ రావడంతో పెద్దగా ఎవరూ పట్టించులేదనేది నేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

    నెల రోజులుగా రాత్రింబవళ్లు ప్రమోషన్స్

    నెల రోజులుగా రాత్రింబవళ్లు ప్రమోషన్స్

    RRR సినిమాను దేశవ్యాప్తంగా ప్రతీ గడపకు చేర్చడానికి గత నెల రోజులుగా టీమ్ రాత్రింబవళ్లు కష్టపడ్డారు. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన ప్రమోషన్స్ మంచి క్రేజ్ లభించింది. దాంతో RRR సినిమాకు మంచి బజ్ రావడంతో యూనిట్‌లో మంచి జోష్ కనిపించింది. కానీ కరోనావైరస్ కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో అభిమానుల షాక్ తిన్నారు.

    20 కోట్ల మేర నష్టం

    20 కోట్ల మేర నష్టం


    RRR సినిమా వాయిదా పడటంతో భారీగా నిర్వహించిన ప్రమోషన్స్ నిరూపయోగంగా మారాయి. ఈ సినిమా వాయిదా కారణంగా దాదాపు 20 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే మళ్లీ మొదటి నుంచి రకరకాల ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంటుంది. దాంతో అదనంగా మరికొంత బడ్జెట్‌తో ప్రమోషన్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    SS Rajamouli's crazy project RRR release date postponed due to Covid 19 cases rise in India. They spent 20 crores for the promotions national wide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X