Naatu Naatu గూగుల్‌లో టాప్ లేపిన నాటు నాటు.. ఎంత మంది వెతికారంటే?
ఆస్కార్ అవార్డుల వేడుకలో RRR చిత్రం సత్తా చాటిన తర్వాత ప్రపంచమంతా నాటు నాటు పదంతో మార్మోగుతున్నది. 95వ అకాడమీ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో లేడి గాగ, రిహాన్నా లాంటి మ్యూజిక్ దిగ్గజాలతో పోటీపడుతూ కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకొన్న తర్వాత ఈ పాట కోసం ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తెగ వెతికినట్టు తాజా డేటా వెల్లడిస్తున్నది. ఈ వివరాల్లోకి వెళితే..
ఆస్కార్ వేదికపై RRR అంటూ ప్రకటించగానే.. నాటు నాటు నామస్మరణ భారీగా పెరిగిపోయింది. ప్రపంచమంతా నాటు నాటు అంటూ గొంతెత్తి అరిచింది. సినీ అభిమానులు, సాధారణ జనం స్టెప్పులతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్ చేసి తమ ఆనందాన్ని పంచుకొన్నారు.

అయితే నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిందనే వార్త బయటకు రాగానే.. ఈ పాట కోసం ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్చ్‌లో విపరీతంగా వెతికారని తాజా డేటా వెల్లడించింది. గతంలో నాటు నాటు గురించి సర్చ్ పరిశీలిస్తే.. 10 రెట్లు సర్చ్ పెరిగింది. 1105 శాతం సర్చ్ పెరిగిందని డేటా వెల్లడించింది.
ఇదిలా ఉండగా, టిక్ టాక్‌లో నాటు నాటు పాట కూడా ప్రభంజనం సృష్టించింది. దాదాపు 52.6 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంతేకాకుండా షేర్ చాట్, ఇంకా సోషల్ మీడియా యాప్స్‌లో నాటు నాటు పాటపై రీల్స్, షార్ట్స్ రూపంలో దుమారం రేపాయి.


Click it and Unblock the Notifications











